Manchu Vishnu – Deepika:దీపిక పదుకొనే (Deepika Padukone), సందీప్ రెడ్డి వంగాల ఇష్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఈ గొడవలో కొంతమంది దీపికకు సపోర్ట్ చేస్తే.. మరి కొంత మంది డైరెక్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై మంచు విష్ణు కూడా ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. మరి ఇంతకీ మంచు విష్ణు (Manchu Vishnu) దీపికా పదుకొనే ఎనిమిది గంటల పని దినంపై ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప మూవీ (Kannappa Movie) ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. నార్త్ , సౌత్ రెండు ఇండస్ట్రీలను కవర్ చేస్తూ వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు.
8 గంటల పని దినంపై మంచు విష్ణు రియాక్షన్..
అయితే అలాంటి మంచు విష్ణు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ లో 8 గంటల పని దినం పై మాట్లాడుతూ.. షూటింగ్ సెట్ కి వచ్చాక నేను 8 గంటలు మాత్రమే పని చేస్తాను అంటే కుదరదు. సినిమా స్టోరీ విన్నప్పుడే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే నేను ఈ సినిమా షూటింగ్లో కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని ముందే కండిషన్ పెట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి.. ఒకవేళ అలా పర్మిషన్ తీసుకోకుండా 8 గంటల షిఫ్ట్ లోనే సినిమా షూటింగ్ చేస్తాను అంటే కుదరదు.పర్మిషన్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. పర్మిషన్ తీసుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కన్నప్ప సినిమా షూటింగ్ టైంలో అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా 8 గంటల షిఫ్ట్ వర్క్ లోనే పని చేశారు.కానీ ఆయన ఆ 8 గంటల సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా సినిమా కోసం 100% ఇచ్చారు ” అంటూ మంచు విష్ణు దీపికా పదుకొనే 8 గంటల వర్క్ గురించి క్లారిటీ ఇచ్చారు.
సందీప్ – దీపిక ఘటనపై విష్ణు ఇండైరెక్ట్ కామెంట్..
అయితే అసలు వివాదం ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ (Prabhas) తో తీసే స్పిరిట్ సినిమా(Spirit Movie) కోసం దీపిక పదుకొనేని హీరోయిన్ గా ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు దీపికా పదుకొనే కేవలం తన ఆఫీస్ టైమింగ్ లోనే అంటే 8 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటానని చెప్పింది.మిగతా టైం లో పాల్గొననని చెప్పింది. ఇక ఈ విషయం నచ్చని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దీపికను తీసేసి త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) ని హీరోయిన్ గా తీసుకున్నారు.అయితే ఒక సినిమాకి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ ఏ టైంలో జరిగితే ఆ టైం కి ఎంత సేపు జరిగితే అంత సేపు షూటింగ్ సెట్ లో ఉండాల్సిందే. ఒకవేళ నేను ఉండను.. నాకు టైమ్ సెట్ కాదు అని అనుకుంటే మాత్రం సినిమా స్టోరీ వినేటప్పుడు అగ్రిమెంట్ చేసుకోవాలి అంటూ మంచు విష్ణు, దీపిక పదుకొనే విషయంలో ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశారు.
ALSO READ:Allam Gopala Rao Death:సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినీ నటుడు ఏ. గోపాలరావు మృతి!