BigTV English

HBD Allu Arjun: క్రేజ్ తో పాటు ఆస్తులు కూడా.. పుష్పరాజ్ ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా..?

HBD Allu Arjun: క్రేజ్ తో పాటు ఆస్తులు కూడా.. పుష్పరాజ్ ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా..?

HBD Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘గంగోత్రి’ సినిమాతో తన సినీ కెరియర్ ను మొదలుపెట్టి, నేడు విదేశాలలో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన సుకుమార్ (Sukumar )దర్శకత్వంలో ‘పుష్ప’ సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప 2’ సినిమాను విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రెండవ స్థానాన్ని దక్కించుకుంది ఈ సినిమా. ఇకపోతే ఇప్పట్లో ఈ రికార్డును ఏ సినిమా కూడా క్రియేట్ చేయలేదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతుండగా.. అందులో భాగంగానే ఆయన దగ్గర ఉండే ఆస్తుల వివరాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి పుష్ప రాజ్ ఆస్తులు విలువ ఎన్ని కోట్లో ఇప్పుడు చూద్దాం.


Pawan Kalyan: అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ కొడుకు.. ఆందోళనలో డిప్యూటీ సీఎం..!

అల్లు అర్జున్ ఆస్తులు..


అల్లు అర్జున్ తన తండ్రి, తాతల వారసత్వంగా వచ్చే ఆస్తులు కాకుండా సొంతంగానే రూ.600 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఒకవైపు సినిమాలతో పాటు మరొకవైపు ప్రొడక్షన్, మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు పలు రకాల రంగాలలో పెట్టుబడులు పెట్టి భారీగా సంపాదిస్తున్నారు. అంతేకాదు పలు సంస్థలకు బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు కూడా చేస్తూ అటు సోషల్ మీడియా నుండి కూడా భారీగా సంపాదిస్తున్నారు అల్లు అర్జున్. ఈ మధ్యకాలంలో సినిమాలకు రెమ్యూనరేషన్ కాకుండా సినిమాల లాభాలలో కూడా వాటా తీసుకుంటూ.. భారీగా ఆస్తులు కూడబెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లగ్జరీ లైఫ్ ను అనుభవించే అల్లు అర్జున్.. తన ఫ్యామిలీ కోసం ఒక ప్రైవేట్ జెట్ కూడా కొనుగోలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కాకుండా కొత్తగా మరో భారీ బంగ్లాను కూడా కట్టిస్తున్నారు. ఇక లగ్జరీ కార్లు , కోట్ల విలువ చేసే వస్తువులకైతే కొదవే లేదు.

అల్లు అర్జున్ కార్ కలెక్షన్స్..

ఇక అల్లు అర్జున్ కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. సొంత లగ్జరీ వ్యానిటీ వ్యాన్ తో పాటు రేంజ్ రోవర్ , హమ్మర్ హెచ్ 2 ఎస్ యు వి కార్లు ఆయన కార్ గ్యారేజీలో ప్రత్యేకం. ఇకపోతే అల్లు అర్జున్ ఫ్యామిలీ సినిమా రంగంలో అలాగే నిర్మాణ రంగంలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. గత 50 ఏళ్లుగా గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా అందించారు. రీసెంట్ గా అల్లు స్టూడియో నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇక అంతే కాదు అల్లు ఫ్యామిలీ మై హోమ్స్ తో కలిసి ఆహా ఓటీటీ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే..ఇందులో కూడా అల్లు అర్జున్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నారు.

అల్లు అర్జున్ బిజినెస్..

ఇక ఈయన బిజినెస్ ల సంగతికొస్తే బఫెలో వైల్డ్ వింగ్స్.. అమెరికాకు చెందిన ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఫ్రాంచైజీని అల్లు అర్జున్ కొనుగోలు చేశారు. హైదరాబాదులో కాస్ట్లీ ఏరియాలలో ఈ రెస్టారెంట్ కి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్ తో పాటు మరికొన్ని బిజినెస్ లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ అటు క్రేజ్ తో పాటు ఇటు ఆస్తులు కూడా పెంచుకుంటున్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×