Sudigali Sudheer :తెలుగు బుల్లితెర రారాజు ప్రదీప్ మాచిరాజు గురించి తెలియని వారు ఉండరు. యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యాంకరింగ్ చేయడంలో ప్రదీప్ స్టైలే వేరు. ఛానల్ ఏదైనా, ప్రదీప్ ఉంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అనే విధంగా ప్రదీప్ యాంకరింగ్ ఉంటుంది. కెరియర్ పరంగా మరో మెట్టు ఎక్కిన ప్రదీప్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మళ్ళీ మన ముందుకు రానున్నాడు. ప్రదీప్ హీరోగా దీపిక పిల్లి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కు నితిన్, భరత్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ స్నేహితులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా మూవీ టీం వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రదీప్, శేఖర్ మాస్టర్, జిమ్ము లో సందడి చేశారు. ఆ వివరాలు చూద్దాం..
జిమ్ కి వెళ్లిన శేఖర్ మాస్టర్ ..ప్రదీప్
ఈసారి సినిమా కోసం ప్రదీప్ గట్టిగానే కష్టపడుతున్నాడు. ప్రమోషన్స్ ని కొత్తగా, వెరైటీగా ట్రై చేస్తున్నాడు.అందులో భాగం గా ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఇద్దరు జిమ్ కి వెళ్తారు. అక్కడ అప్పటికే సుడిగాలి సుదీర్ ఉంటాడు. వీళ్ళ మధ్య సరద సంభాషణ జరుగుతుంది. సుడిగాలి సుదీర్, శేఖర్ మాస్టర్ కలిసి మాట్లాడే ప్రతి మాట నవ్వు తెప్పిస్తాయి. అలాంటిది ఇక ప్రదీప్ కలిస్తే నవ్వులే నవ్వులు. ఇక జిమ్ లో ఏమి జరిగిందంటే.. సుధీర్ నేను చెప్పినట్లుగా మీరు ట్రైన్ అవ్వండి. అప్పుడు మీకు సిక్స్ ప్యాక్ బాడీ వస్తుంది అని అంటాడు. నీది సిక్స్ ప్యాక్ బాడీ నా, సిక్స్ ప్యాక్ బాడీ అంటే నాది అంటాడు ప్రదీప్. ఇక్కడ ట్రైనర్ నేను అంటాడు. నేను చెప్పినట్లు చేయండి. వెళ్లి టెన్ కేజిస్ డంబుల్స్ తీసుకురండి. శేఖర్ మాస్టర్, ప్రదీప్ వెళ్లి డంబుల్స్ తీసుకురాగానే, సుధీర్ నేను ఎలా చేస్తున్నానో చూడండి. నాది ప్రొఫెషనల్ బాడీ అని అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్ధం కావట్లేదు అంటాడు ప్రదీప్.
సుదీర్ సినిమాకి వెళ్ళేది అందుకోసమా ..
సుధీర్ ని శేఖర్ మాస్టర్ డబల్ మీనింగ్ వచ్చేలాగా ,నువ్వు చేసే సౌండ్స్ జిమ్ లో బాడీ తెచ్చుకోవడానికి కాకుండా ఇంకోలా ఉన్నాయి అని అంటాడు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు . మీ సినిమా ప్రమోషన్స్ కోసం కదా.. మరి అలాంటప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి. మరి మీ సినిమాలో ఎమన్నా సీన్స్ ఉన్నాయా అని అంటాడు. సుధీర్ డబల్ మీనింగ్ తో, ఏం మాట్లాడుతున్నావ్ రా అన్ని సీన్స్ ఉంటేనే సినిమా అయ్యేది అంటాడు ప్రదీప్. నేను అడిగేది మొత్తం సినిమా కథ గురించి కాదు, చిన్నచిన్న షాట్స్ ఏమన్నా ఉన్నాయా అంటాడు. వెంటనే శేఖర్ మాస్టర్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. నేనేమన్నానండి చిన్న బిట్లు ఏమన్నా ఉన్నాయా అని అన్నాను. అలాంటివి ఏమీ లేవు అంటాడు ప్రదీప్. సరే ఏది ఏమైనా మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటాడు సుధీర్. ఏప్రిల్ 11న సినిమా రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా చూడండి .అని సుధీర్ వాళ్ళని విష్ చేస్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన సుడిగాలి సుదీర్ అభిమానులు షేర్ చేస్తూ వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు.
Sudigali #Sudheer Tried a DIFFERENT PROMOTIONS with #Pradeep For the Film 🥵🥵🥵💥💥💥#AkkadaAmmayiIkkadaAbbayi – Fun Film – April 11th ✅
— GetsCinema (@GetsCinema) April 7, 2025