Vishwambhara movie release date:సాధారణంగా దర్శకనిర్మాతలైనా.. హీరోలైనా.. హీరోయిన్లైనా.. ఖచ్చితంగా తమ సినిమా విడుదల చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలో కంటెంట్ ఉందా..? ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? ఎప్పుడు విడుదల చేస్తే సినిమా కలెక్షన్స్ వస్తాయి? అసలు ప్రస్తుతం అనుకున్న సమయాల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావాలి అంటే.. ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలి ? సెలవులు ఉన్నాయా ?లేదా ?అనే విషయాలను తప్పకుండా చూసుకుంటూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం సెంటిమెంటును ఫాలో అవుతారు అనడంలో సందేహం లేదు..ఒకసారి ఫలానా సమయంలో ఫలానా సినిమా విడుదల చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం మళ్లీ అదే డేట్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.
అయితే అలా రిలీజ్ చేసినప్పుడు సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే అదే రిపీట్ చేస్తారు. లేకపోతే బొక్క బోర్ల పడతారు. అయితే ఇప్పుడు ఇదే విషయంలో అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) కూడా మిస్టేక్ చేస్తున్నారేమో అని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ సెలవులను క్యాష్ చేసుకోవాలని చిన్న హీరోని మొదలుకొని పెద్ద హీరోలు కూడా తాపత్రయ పడుతుంటే.. అన్నయ్య మాత్రం సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. అసలు విషయంలోకెళితే మెగాస్టార్ చిరంజీవి , ‘భోలా శంకర్’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం :విశ్వంభర’. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు. ఇక మే నెలలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో సెలవులు కాబట్టి సినిమాకి లాభాలు వచ్చే అవకాశాలుంటాయని నెటిజన్స్ కూడా సంబరపడిపోయారు.
HBD Allu Arjun: క్రేజ్ తో పాటు ఆస్తులు కూడా.. పుష్పరాజ్ ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా..?
ఇప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమాపై ‘ఇంద్ర’ ఎఫెక్ట్ ను రుద్దబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. విశ్వంభర సినిమాను జూన్ 24 కి వాయిదా వేశారు. అంటే జూన్ 24వ తేదీన గతంలో ‘ఇంద్ర’ సినిమా విడుదలై మ్యాజిక్ క్రియేట్ చేసింది కాబట్టి అలాంటి మ్యాజిక్ మళ్ళీ విశ్వంభర సృష్టించబోతోంది అనే నేపథ్యంలో ఇలా సినిమా తేదీని వాయిదా వేశారు. ఇది చూసిన అభిమానులు నెటిజన్లు సెంటిమెంట్ కాదు అన్నయ్య ప్రస్తుతం రియాల్టీ లోకి రండి.. ఎవరైనా సరే సెలవులను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. మీరు మాత్రం సెంటిమెంట్ ని వర్కౌట్ చేస్తామంటే ఎలా.. అసలే అప్పుడప్పుడే స్కూళ్లు , కాలేజీలు అన్ని ఓపెన్ అవుతాయి. ఆ సమయంలో థియేటర్ కి ఎవరు వచ్చి సినిమాలు చూస్తారు. దయచేసి రియాల్టీని దృష్టిలో పెట్టుకొని విశ్వంభర రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయండి అంటూ కోరుకుంటున్నారు. మరి ఇకనైనా చిరంజీవి ఈ విషయంపై రియలైజ్ అవుతారో లేదో చూడాలి.