Hebah Patel : టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీ అంటే అందరికీ టక్కున వినిపించే పేరు హెబ్బా పటేల్.. కుమారి 21ఎఫ్ లాంటి సినిమాల్లో నటించి తన గ్లామర్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ గ్లామరస్ లుక్ లో కనిపించేది. అయితే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని ఆమెకు అందించలేదు.. దాంతో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా హెబ్బాకు మంచి క్రేజ్ ని అందించింది. ఆ మూవీకి సీక్వెల్ గా ఓదెలా 2 ఇటీవల రిలీజ్ అయింది. ఈ సినిమా ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా.. పరంగా హిట్ భారీనే వసూల్ చేసి హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా హెబ్బా పటేల్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. ఇందులో ఆమె గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.. ఇంతకీ హెబ్బా ఆ వీడియోలో ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హెబ్బా పటేల్ ఇంటర్వ్యూ..
టాలీవుడ్ గ్లామర్ క్వీన్ హెబ్బా పటేల్ కరోనా టైం లో ఓదెల సినిమాలో నటించింది. ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీకి సీక్వల్ గా ఓదెలా 2 మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో హిట్ అయింది.. మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా గ్లామర్ రోజు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది వివరించింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు ఆమెపై పాజిటివ్గా కామెంట్లు చేస్తున్నారు..
గ్లామర్ రోల్స్ అందుకే చేశాను..?
హెబ్బా పటేల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అలా ఎలా? అనే మూవీతో ఎంట్రీ వచ్చింది. ఆ మూవీలో చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. కుమారి 21ఎఫ్ సినిమాలో రొమాంటిక్ సీన్లలో కనిపించి బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నిటిలోనూ అలానే కనిపించింది. అయితే ఏ మూవీ కూడా తనకి మంచి సక్సెస్ అయితే ఇవ్వలేకపోయింది. దాంతో ఆమె గ్లామర్ పాత్రలకి పుల్ స్టాప్ పెట్టేసి పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేసేందుకు ఆసక్తి కనబరిచింది. అలా ఓదెలా రైల్వే మూవీలో నటించింది. అయితే హెబ్బా పటేల్ గ్లామర్ రోజు చేయడానికి కారణం అప్పట్లో ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇందులో అప్పుడు ఆ పాత్రల గురించి చెప్పే వాళ్ళు కూడా లేకపోవడంతో నేను ఒక జాబ్ లాగానే చేశాను. డబ్బులు తీసుకున్నాను.. ఇప్పుడు నేను బాగా సెటిల్ అయ్యాను.. కాబట్టి ఇక మీదట పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తాను. అని హెబ్బా అన్నారు. ప్రస్తుతం ఓదెల 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈమె త్వరలోనే మరో ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది..