This Week Releases: ఈవారం థియేటర్లలో ఎన్నో చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి. దాంతో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా వీటితో పోటీపడుతున్నాయి. వాటికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్స్ తాజాగా బయటికొచ్చాయి.
తల్లి మనసు
తండ్రీ, కొడుకుల అనుబంధంపై తెరకెక్కిన ఒక మిడిల్ క్లాస్ చిత్రమే ‘తల్లి మనసు’. ఒక తల్లి ప్రేమకు అద్దం పట్టే సినిమా కాబట్టి దీంట్లో సెన్సార్ ఎలాంటి కట్స్ చేయలేదు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ఇందులో శుభలేఖ సుధాకర్, ఆదర్శ్ బాలకృష్ణ, కమల్ కామరాజు లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ జనవరి 24న విడుదలకు సిద్ధమయ్యింది.
డియర్ కృష్ణ
‘ప్రేమలు’ అనే మలయాళ సినిమాతో మలయాళ ప్రేక్షకులను మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షుకులను కూడా మెప్పించింది మమితా బైజు. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతోంది. ‘డియర్ కృష్ణ’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. జనవరి 24న విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్.. యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ఈ మైవీకి అయిదు మార్పులు చేసింది సెన్సార్.
ఫ్లైట్ రిస్క్
ఈవారం ఒక ఇంగ్లీష్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘ఫ్లైట్ రిస్క్’. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సెన్సార్ పూర్తిగా ‘ఏ’ సర్టిఫికెట్ అందించింది. మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మార్క్ వాహ్ల్‌బర్గ్, మిషెల్ డాక్రీ, టాఫర్ గ్రేస్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ జనవరి 24న ఇండియాలో విడుదలకు సిద్ధమయ్యింది.
ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్
ఒక హాంగ్ కాంగ్ భాషకు చెందిన సినిమా కూడా ఈ వారంలో ఇంగ్లీష్‌లో డబ్ అయ్యి మరీ ఇంగ్లీష్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్’. ఈ మూవీ గతేడాది హాంగ్ కాంగ్ భాషలో విడుదలయ్యి హిట్ కాగా ఇప్పుడు ఇంగ్లీష్‌లో విడుదలవుతోంది. దీనికి కూడా సెన్సార్.. ఏ సర్టిఫికెటే అందించింది.
స్కై ఫోర్స్
ఏ సినిమాకు అయినా కేవలం మూడు నెలలు మాత్రమే కేటాయించే అక్షయ్ కుమార్.. ‘స్కై ఫోర్స్’ అనే సినిమాను కూడా మూడు నెలల్లో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక ఆర్మీ ఆఫీసర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా.. జనవరి 24న విడుదల కానుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
హాంగ్‌కాంగ్ వారియర్స్
హాంగ్‌కాంగ్ వారియర్స్ అనే ఒక హాంగ్ కాంగ్ మూవీ కూడా ఈ వారంలో ఇంగ్లీష్‌లో డబ్ అయ్యి ఇండియాలో విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్‌కు సెన్సార్.. ‘ఏ’ సర్టిఫికెట్ అందించింది. యాక్షన్ కంటెంట్ ఎక్కువ ఉన్న సీన్స్ దగ్గర వార్నింగ్ ఇవ్వమని తెలిపింది.
హత్య
ఈ వారం ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా థియేటర్లలో సందడి చేయనుంది. అదే ‘హత్య’. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ పూర్తిగా ‘ఏ’ సర్టిఫికెట్ అందించింది. అంతే కాకుండా ఈ వారం విడుదల కానున్న సినిమాల్లో అత్యధిక కట్స్ కూడా ఈ మూవీకే విధించింది. ఈ సినిమాలో దాదాపు పావుగంట పాటు సీన్స్, డైలాగ్స్ అన్నీ కట్ చేశారని మూవీ సెన్సార్ సర్టిఫికెట్ చూస్తే అర్థమవుతోంది.
ఐడెంటిటీ
ఈరోజుల్లో మలయాళం సినిమాలకు మామూలు క్రేజ్ లేదు. మలయాళంలో ఏ మూవీ విడుదలయినా అది కచ్చితంగా బాగుంటుంది అని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోతున్నారు. అలా జనవరిలో త్రిష, టోవినో థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఐడెంటిటీ’ మూవీ మలయాళంలో విడుదలయ్యి సూపర్ హిట్ కాగా ఇప్పుడు అదే మూవీ జనవరి 24న తెలుగులోకి రాబోతోంది. దీనికి సెన్సార్.. యూ/ఏ సర్టిఫికెట్ అందించింది.
గాంధీ తాత చెట్టు
పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది తన కుమార్తె సుకృతి వేణి. ‘గాంధీ తాత చెట్టు’ అనే సోషల్ మెసేజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ జనవరి 24న విడుదల అవుతుండగా ఈ మూవీ సెన్సార్.. యూ సర్టిఫికెట్ అందించింది.