BigTV English

Devara Collections: బాక్సాఫీస్ బద్దలయ్యింది.. ఆరు రోజుల్లో ‘దేవర’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Devara Collections: బాక్సాఫీస్ బద్దలయ్యింది.. ఆరు రోజుల్లో ‘దేవర’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Devara Box Office Collections: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ను మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌ను ‘దేవర’తో మాస్ ఫీస్ట్ అందించాడు దర్శకుడు కొరటాల శివ. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ ఎలాంటి సినిమా చేస్తాడా అని మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. వారందరినీ ఎంటర్‌టైన్ చేయడం కోసం ‘దేవర’ లాంటి మాస్ కమర్షియల్ సినిమాతో వచ్చాడు తారక్. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత విడుదలయిన గ్లింప్స్‌తో ఈ మూవీలో బ్లడ్ బాత్ మామూలుగా ఉండదని హింట్ ఇచ్చాడు కొరటాల. మొత్తానికి ఈ సినిమా విడుదలవ్వగానే మిక్స్‌డ్ టాక్ అందుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది.


కలెక్షన్స్ ఎంతంటే

పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడిన తర్వాత ఫైనల్‌గా సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేసింది ‘దేవర’. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ ఎలా ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు ఊహించారో.. అంతకు మించి యాక్షన్‌ను అందించి ఎంటర్‌టైన్ చేశాడు. కానీ మామూలు ప్రేక్షకుడికి మాత్రం ఇదొక యావరేజ్ సినిమా అనిపించింది. మొదటిరోజే మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుంది అనుకున్నారు మేకర్స్. కానీ అలా జరగలేదు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కాస్త డల్ అయినట్టు అనిపించినా.. వెంటనే పుంజుకుంది కూడా. పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం కూడా ‘దేవర’కు ప్లస్ అయ్యింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు వారం రోజులు కావడంతో ఈ 6 రోజుల కలెక్షన్స్ వివరాలు బయటపెట్టారు మేకర్స్.


Also Read: రోజులు మారిన టాప్ ప్లేస్ మారలేదు, ఇది సార్ మీ రేంజ్

బాక్సాఫీస్ లెక్కలు

‘దేవర’ విడుదలయిన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు. బాక్సాఫీస్‌పై ఎన్‌టీఆర్ వేటకు దిగాడంటూ సంతోషంగా ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. కానీ ఈ బాక్సాఫీస్ లెక్కలు నిజమా కాదా అని సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. ఇప్పటికీ ‘దేవర’ సినిమాను చూడడం కోసం మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్తున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు. మొదట్లో ‘దేవర 2’ ఎందుకులే అన్నవారే ఇప్పుడు అసలు పార్ట్ 2 కథ ఏమయ్యింటుందో అని అంచనా వేస్తున్నారు.

మళ్లీ ఫార్మ్‌లోకి కొరటాల

‘దేవర’కు ముందు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసి ‘ఆచార్య’ అనే సినిమాను తెరకెక్కించాడు కొరటాల శివ. భారీ అంచనాల మధ్య విడుదలయిన ‘ఆచార్య’ డిశాస్టర్ అయ్యింది. ఆ ఎఫెక్ట్ కొరటాలపై పడింది. అందుకే చాలావరకు స్టార్ హీరోలు తనతో సినిమాలు చేయడానికి కూడా ముందుకు రాలేదని సినీ సర్కిల్లో వార్తలు వినిపించాయి. అలాంటిది ఎన్‌టీఆర్.. ఆయనకు మరొక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ‘దేవర’తో నిరూపించుకున్నారు కొరటాల. మిక్స్‌డ్ టాక్‌తో మొదలయినా కూడా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుండడంతో కొరటాల మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చారు. ఇక ఎన్‌టీఆర్ కూడా ఇదే మోటివేషన్‌తో ప్రశాంత్ నీల్ సినిమాలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×