Ram Charan: మామూలుగా ప్రతీ హీరో లేదా హీరోయిన్ తాము సైన్ చేసే సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతోనే సైన్ చేస్తారు. అలా అవ్వాలనే ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. కానీ ఒకవేళ అది మరీ ప్రేక్షకులను మెప్పించలేకుండా ఉంటే ఫ్యాన్స్ సైతం ఆ విషయంలో ఏమీ చేయలేరు. అలా అసలు ఈ సినిమా ఎందుకు చేశానా అని హీరోలు లేదా హీరోయిన్లు రిగ్రెట్ అయ్యే సినిమా ఒకటి ఉంటుంది. అలా రామ్ చరణ్ కెరీర్‌లో కూడా తను రిగ్రెట్ అయ్యే సినిమా ఒకటి ఉందట. త్వరలోనే బాలకృష్ణతో రామ్ చరణ్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ స్పెషల్ ఎపిసోడ్ బయటికి రానుండగా అందులో తను చెప్పిన ఆసక్తికర విషయం ఒకటి ముందుగానే బయటికొచ్చింది.
ప్రమోషన్స్ కోసం
ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan).. శంకర్‌తో కలిసి చేసిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల నుండి ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గేమ్ ఛేంజర్’ కథ ఓకే అయ్యి, సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుండి దీనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఒకానొక సందర్భంలో అసలు ఈ సినిమా ఉందా లేదా అని ప్రేక్షకులకే అనుమానం వచ్చింది. కానీ మొత్తానికి చాలా గ్యాప్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఔట్‌పుట్‌తో ఇన్నాళ్లకు ఈ మూవీ బయటికొస్తోంది. అందుకే ‘గేమ్ ఛేంజర్’ను ప్రమోట్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా వదులుకోని రామ్ చరణ్.. బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’కు కూడా వచ్చాడు.
Also Read: పటౌడీ వారసుడితో శ్రీలీల.. బాలీవుడ్ కు కొత్త జంట దొరికిందిరోయ్
రిగ్రెట్ అవుతున్నాను
‘అన్‌స్టాపబుల్’లో అసలు తాను నటించిన సినిమాల్లో ఏ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఫీలవుతున్నారు అని రామ్ చరణ్‌ను అడగగా.. దానికి ‘జంజీర్’ అని సమాధానమిచ్చాడు చరణ్. అసలైతే ఈ మూవీ రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూగా నిలిచిపోయింది. అప్పటివరకు కేవలం తెలుగు సినిమాలే చేసిన చరణ్.. ‘జంజీర్’తో తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అపూర్వ లాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘోరమైన డిశాస్టర్‌గా నిలిచిపోయింది. దీంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లాలనే కలలు కనలేదు రామ్ చరణ్. 2013లో విడుదలయిన ‘జంజీర్’ గురించి ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారు కూడా.
కల్ట్ క్లాసిక్‌తో రిస్క్
1973లో ‘జంజీర్’ (Zanjeer) అనే టైటిల్‌తో అమితాబ్ బచ్చన్ సినిమా ఒకటి వచ్చింది. దానినే 2013లో రీమేక్ చేశాడు రామ్ చరణ్. బాలీవుడ్ ప్రేక్షకులకు ‘జంజీర్’ అనేది కల్ట్ క్లాసిక్‌గా గుర్తుండిపోయింది. అదే మూవీని మళ్లీ రీమేక్ చేయడం, అప్పటివరకు రామ్ చరణ్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల ఈ మూవీ పెద్ద డిశాస్టర్‌గా నిలిచింది. దాని తర్వాత మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’తోనే బీ టౌన్‌లో అడుగుపెట్టాడు ఈ మెగా హీరో. అప్పుడు మాత్రం సక్సెస్ తనను వరించింది.ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’కు కూడా బీ టౌన్‌లో బాగానే బజ్ ఉంది.