Renu Desai:నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను చాలామంది దేవుడిగా కొలుస్తారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణను ఎన్టీఆర్ (Sr.NTR) లాగా గౌరవిస్తారు. అయితే అలాంటి నందమూరి బాలకృష్ణ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అలా బాలకృష్ణ హీరోగా చేసిన తాజా మూవీ ‘డాకు మహారాజ్’ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగాల్సి ఉండగా..నిన్న సాయంత్రం తిరుమలలో తొక్కిసలాట కారణంగా ఈ ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు మూవీ నిర్మాతలు. ఇదిలా ఉండగా .. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి సంబంధించిన సినిమాలు విడుదలైనా సరే.. ఆ హీరోకి సంబంధించి గతంలో ఉన్న మంచి విషయాలు, చెడు విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే తాజాగా బాలకృష్ణకు సంబంధించి కూడా ఒక సంచలన నిజం బయట పడింది. ఓ యాంకర్ కోసం 45 నిమిషాలు బాలకృష్ణ అలా చేశారనే విషయం తెలుసుకున్న నటి రేణూ దేశాయ్ (Renu Desai) కూడా షాక్ అయింది. మరి ఇంతకీ బాలకృష్ణ చేసిన పనేంటి..? రేణు దేశాయ్ అంతలా ఎందుకు షాక్ అవ్వాల్సి వచ్చింది? అనేది ఇప్పుడు చూద్దాం..
బాలయ్య గొప్ప హృదయం పై ఉదయభాను కామెంట్స్
బాలకృష్ణని ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది పొగుడుతూ ఉంటారు.అయితే అభిమానులకు బాలకృష్ణ అంటే దేవుడితో సమానం. ఆయన కోపంతో చేయి చేసుకున్నా సరే ప్రేమతో తట్టారు అని అనుకుంటారు. కానీ బాలకృష్ణ కోపం వల్ల ఎన్నో ట్రోల్స్ కి గురయ్యారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మమ్మల్ని కొట్టినా సరే మాకు బాలయ్య దేవుడు అన్నట్లుగా మాట్లాడతారు. అయితే అలాంటి బాలకృష్ణ గురించి ఒకప్పటి యాంకర్ ఉదయభాను (Udaya Bhanu) ‘నీతోనే డాన్స్’ అనే షోలో మాట్లాడుతూ.. బాలకృష్ణ గొప్పతనం చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. “నా కూతుర్ల బర్త్డేకి రమ్మని బాలకృష్ణకు మెసేజ్ పెట్టాను.ఆ తర్వాత 30 నిమిషాలకే ఆయన కాల్ చేసి తప్పకుండా వస్తాను అని చెప్పారు.ఇక బర్త్డే రోజు ఏదో ఫార్మాలిటీగా అటు వచ్చి ఇటు వెళ్లిపోకుండా.. బాలకృష్ణ 45 నిమిషాల పాటు బర్త్డే పార్టీలోనే గడిపారు. అంతేకాదు ఫోటోలు అడిగిన ప్రతి ఒక్కరితో ఫొటోస్ దిగారు. అలా బాలకృష్ణ బర్త్డే పార్టీకి నడుచుకుంటూ వస్తుంటే సింహం లాగా కనిపించారు. నాకు బాలకృష్ణ దేవుడితో సమానం.. ఆయన లాంటివారు ఇండస్ట్రీలో చాలా రేర్ గా ఉంటారు. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఎంతో మంచిది” అంటూ ఉదయభాను బాలకృష్ణకు సంబంధించి సంచలన విషయాన్ని బయట పెట్టింది.
ఉదయభాను మాటలకు షాక్ లో రేణు దేశాయ్..
ఇక ఉదయభాను మాటలు విన్న రేణు దేశాయ్ షాక్ లో మునిగిపోయింది. అయితే నీతోనే డాన్స్ షోలో రేణు దేశాయ్ జడ్జిగా వచ్చింది. అలా ఉదయభాను మాటలకి రేణు దేశాయ్ కూడా షాక్ అయిపోయి ఇలాంటి వారు కూడా ఉంటారా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చప్పట్లు కొట్టింది. ఇక యాంకర్ ఉదయభాను కెరియర్ మళ్ళీ ఇప్పుడు గాడిన పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా సత్యరాజ్ (Sathyaraj) కీలకపాత్రలో నటిస్తున్న ‘బార్బరిక్’ మూవీలో పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ఆమెకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఉదయభాను మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.