Jayam Ravi : కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. మొన్నటి వరకు ఆయన సినిమాలతో బిజీగా ఉన్నాడు.. కానీ ఇప్పుడు మాత్రం తన భార్యతో విడాకులు ఇచ్చిన తర్వాత మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టిండా ప్రచారం జరుగుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం కూడా ఉంది. జయం రవి తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ పెళ్ళికి అటెండ్ అవ్వడంతో ఆ వార్తలు నిజమే అని తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. అయితే తాజాగా మరోసారి తన గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా బుక్ అయ్యాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భార్యతో హీరో విడాకులు..
హీరో జయం రవి ఆయన భార్య ఆర్తి తో విడాకులు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. వీరిద్దరూ దాదాపు 15 నెలల వరకు కాపురం చేశారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గొడవలు ఏమీ లేకుండా తన భార్యతో విడాకులు తీసుకోవడంతో గత ఏడాది నుంచి ఈ టాపిక్ తమిళ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఇటీవల తన గర్ల్ ఫ్రెండ్ సింగర్ కేనిషాతో ఓ పెళ్లికి వెళ్లాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసిన ఆయన భార్య ఆర్తి ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనకు తనను వదిలేసిన బాధ లేదు కానీ తన పిల్లల్ని పట్టించుకోలేదన్న బాధ మాత్రం తనని కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుందంటూ ఆమె ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తో ఇకనైనా ఇద్దరు జంటగా తిరగరు అని అందరూ అనుకున్నారు.. కానీ మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.
గర్ల్ ఫ్రెండ్ తో మరోసారి దొరికిన హీరో..
తమిళ్ ఇండస్ట్రీలో ఈ మధ్య స్టార్ హీరోలు వరుసగా తమ దాంపత్య జీవితానికి స్వస్తి చెప్తున్నారు. భార్యతో మనస్పర్ధలు ఉన్నాయంటూ విడాకులు ప్రకటిస్తున్నారు. ముందుగా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్గా మేము విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అలాగే హీరో జయం రవి కూడా తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ఒక పోస్ట్ పెట్టాడు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా దీనిపై ఎన్నో రకాలు వినిపించాయి. నిన్న డైరెక్టర్ గణేష్ కూతురు పెళ్లిలో ఇద్దరు జంటగా కనిపించడంతో ఈ వార్తలు నిజమని అర్థం అయిపోయింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరు జంటగా కనిపించడంతో తమిళ ప్రేక్షకులు నిజంగానే రిలేషన్ లో ఉన్నారంటూ కన్ఫామ్ చేస్తున్నారు. హీరో జయం రవి సినిమాలపరంగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడేమో ఇలా భార్యతో విడాకులు ఇచ్చి సింగర్ తో తిరుగుతున్నారంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.. ఏది ఏమైనా కూడా ఈ హీరో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడు. ఇకపోతే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేదా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..
Ravi Mohan & Keneeshaa!
— Christopher Kanagaraj (@Chrissuccess) May 10, 2025