Karthi 29..ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీ (Karthi)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈయన, ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేసినా సరే ఆ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తూ రెండు ఇండస్ట్రీలలో మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తీ ఇప్పుడు మరో రియల్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన తన 29వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. జై భీమ్ సినిమాలో ఇన్స్పెక్టర్ గురుమూర్తిగా నటించిన తమిళ(Tamila)ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.
రియల్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కార్తీ.
ముఖ్యంగా సముద్ర దొంగల ముఠా ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమిళనాడులోని రామేశ్వరం – శ్రీలంక ప్రాంతాల మధ్య సముద్రపు దొంగల హవా నడిచేది. ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలి అంటే ప్రయాణికులు భయంతో వణికిపోయేవారు. ఓడలు, పడవలను అడ్డగించే సముద్రపు దొంగలు దొరికినంత దోచుకొని పరారయ్యేవారు. ఇప్పుడు ఈ కథతోనే హీరో కార్తీ దర్శకుడు తమిళ తో ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ తమిళ విషయానికి వస్తే.m ఈయన గతంలో విక్రమ్ ప్రభు (Vikram Prabhu) తో ‘తనక్కరన్’ అనే సినిమా చేశారు. తమిళ మన తెలుగు వాళ్ళ కూడా బాగా తెలిసిన వారే కావడం గమనార్హం.
కార్తీ రెండు పడవల మీద ప్రయాణం.. వర్క్ అవుట్ అవుతుందా..
ఇక కార్తీ నటిస్తున్న ఈ సినిమా విషయానికి వస్తే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే కార్తి ఖైదీ 2, సర్దార్ 2 చిత్రాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా లోకేష్ కనకరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీక్వెల్ గానే ఇప్పుడు ఖైదీ 2 సినిమా పట్టాలెక్కబోతోంది దాంతో పాటు కార్తీ 29 సినిమాని కూడా పూర్తి చేయాలని కార్తీ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో వడివేలు (Vadivelu) కూడా కీలక పాత్ర పోషిస్తుండగా.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉండగా.. మే లేదా జూన్ నెలలో ఈ సినిమాను సెట్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక అటు లోకేష్ కనగరాజు కూడా ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి కార్తీతో ఖైదీ 2 తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నారట. అందుకే కార్తీ కూడా ఈ రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా హీరో కార్తీ తో సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అభిమానులే టార్గెట్ గా ఈ రెండు సినిమాలతో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.