BigTV English

Nagarjuna: మోసపోయాను.. ఆ యంగ్ హీరో టార్చర్ చేశాడు.. నాగ్ షాకింగ్ కామెంట్స్..!

Nagarjuna: మోసపోయాను.. ఆ యంగ్ హీరో టార్చర్ చేశాడు.. నాగ్ షాకింగ్ కామెంట్స్..!

Nagarjuna : అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్ఆర్ (ANR) తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు వచ్చింది నాగార్జున (Nagarjuna)కి మాత్రమే. ఏఎన్నార్ తర్వాత అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చేసిన వరుస సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత స్టార్ స్టేటస్ అందుకున్నారు. నాగార్జున సినీ కెరియర్ లో ఎన్నో చెరిగిపోని సినిమాలు ఉన్నాయి. ఈయన సినీ కెరీర్ కు శివ, గీతాంజలి వంటి సినిమాలు పాన్ ఇండియా స్టేటస్ ను అందించాయి. అయితే అలాంటి ఈ హీరో ప్రస్తుతం హీరో గానే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషిస్తున్నారు. ఈయన ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar kammula) డైరెక్షన్లో ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరో హీరోయిన్స్ గా చేస్తున్న ‘కుబేర’ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు.


ఇది మాత్రమే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున ఒక కీ రోల్ పోషిస్తున్నారు. అటు నాగార్జునకు సంబంధించిన ఈ పాత్రని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) చాలా అద్భుతంగా డిజైన్ చేశారని ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ఎంతోమందిని ఆకట్టుకుంది.

నాని మొహం చూసి మోసపోయా..


ఇదిలా ఉండగా నాగార్జున ఓ యంగ్ హీరో గురించి ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ హీరో నిజస్వరూపం ఇదే అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంతకీ నాగార్జున ఏ హీరోకి సంబంధించి షాకింగ్ కామెంట్లు చేశారో ఇప్పుడు చూద్దాం. మొహం చూసి మోసపోవద్దు అంటూ ఓ హీరో గురించి షాకింగ్ కామెంట్లు చేశారు నాగార్జున. ఆ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. నాగార్జున, నాని కాంబినేషన్లో ‘దేవదాస్’ సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన రష్మిక మందన్నా నటించగా.. ఆకాంక్ష సింగ్ నాగార్జున కి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో నాని సెన్సిటివ్ డాక్టర్ గా కనిపిస్తే, నాగార్జున గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపిస్తారు.

నాని పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున..

వీరిద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు ఆధ్యంతం ఆకట్టుకుంటాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మల్టీ స్టారర్ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా ఈవెంట్లో నాగార్జున గురించి నాని స్టేజ్ మీద మాట్లాడుతూ..”నాగార్జున కనిపించేంత సాఫ్ట్ కాదు టార్చర్ చేశారు” అంటూ మాట్లాడుతారు. అయితే ఈయన మాటలకు నవ్వుకున్న నాగార్జున మళ్ళీ స్టేజి పైకి ఎక్కి.. “ఏంటి నాని ఇప్పటిదాకా ఏమో మాట్లాడావ్. నేను నిన్ను టార్చర్ పెట్టానా? నువ్వు నన్ను టార్చర్ పెట్టావా? నాని మొహం చూసి ఎవరు మోసపోవద్దు. ఎందుకంటే నాని ఈ సినిమా చేసే సమయంలో నన్ను చాలా టార్చర్ చేశాడు. బయటికి చాలా సెన్సిటివ్ గా కనిపిస్తాడు. కానీ ట్రావెల్ చేస్తేనే అసలు నిజ స్వరూపం తెలుస్తుంది. నేను అలాగే నాని మొహం చూసి నమ్మాను. డీసెంట్ ఫేస్ కదా కలిసి సినిమా చేద్దాం అనుకున్నాను. కానీ ఆ తర్వాతే అసలు నరకం నాకు కనిపించింది” అని అన్నాడు.

నాని రహస్యాన్ని రివీల్ చేసిన నాగార్జున.

కాగా, ఇది దేవదాస్ సినిమా షూటింగ్ చేస్తున్నన్ని రోజులు నాకు నానితో నరకం కనిపించింది అంటూ నాగార్జున సరదాగా చెప్పుకొచ్చారు. ఇక నాగార్జున మాట్లాడుతున్నంత సేపు నాని చిన్నగా నవ్వుకున్నారు. ఇక ఇదే ఈవెంట్లో నాగార్జున నాని కి సంబంధించి ఒక షాకింగ్ విషయాన్ని కూడా బయటపెట్టారు. నాని టేక్ అయిపోయిందంటే చాలు షూటింగ్ స్పాట్ లో కూర్చుని ఎప్పుడూ ఫోన్ లోనే గడుపుతాడు. పక్కన ఎంత మంచి అమ్మాయి ఉన్నా సరే ఆ ఫోన్లోనే మొహం పెడతాడు. కనీసం ఫోన్ నుండి మొహం కూడా పక్కకి తీయడు. అసలు ఆ ఫోన్లో ఏముందో ఏమో కానీ మరీ అంతలా ఫోన్ కి అడిక్ట్ అవ్వడం మంచిది కాదు.. అంటూ నాని గురించి నాగార్జున ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×