Ethiopia Road Accident| అఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం డిసెంబర్ 29 రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 71 చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఇథియోపియాలోని సిడామా రాష్ట్రం (ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా కు 300 కిలోమీటర్ల దూరంలో) ఆదివారం రాత్రి ఒక ట్రక్కు వంతెన మీద నుంచి వెళుతూ జారీ నదిలో పడింది. ఆ సమయంలో ట్రక్కులో 76 మంది ఉన్నారు. చనిపోయిన 71 మందిలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలున్నారని సిదామా పోలీసులు తెలిపారు.
సిదామా పోలీస్ కమిషన్ ట్రాఫిక్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఈ ఘటన గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ట్రక్కు ప్రమాదంలో 71 మంది చనిపోయారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారు విషమ పరిస్థితిలో ఉండడంతో వారిని సమీపంలోని బోనా జెనెరల్ హాస్పిటల్ కు తరలించామని సిదామా పోలీస్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ డేనియల్ సంకూరా తెలిపారు.
ఈ ప్రమాదం గురించి సిదామా ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి వోసెయెలెహ్ సిమియోన్ ధృవీకరించారు. రాత్రి వేళ నది మీద ఉన్న వంతెన పై నుంచి ఒక ట్రక్కు వెళ్లింది. కానీ ఆ సమయంలో అంధకారం ఉండడంతో దారి తప్పి నదిలో పడిందని ఆయన తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు కూడా ఆయన విడుదల చేశారు. కానీ వాటిలో ఎక్కువ శాతం బ్లర్ చేసి ఉన్నాయి. మరో చిత్రంలో నదిలో సగం మునిగిన ట్రక్కు కనిపిస్తూ ఉంది.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
ఒక చిత్రంలో అయితే చనిపోయిన వారి మృతదేహాలు టార్ పాలిన్ లో చుట్టిపెట్టినట్లు, మరి కొన్ని శవాలు నేలపైనే వరుసగా కనిపిస్తున్నాయి. సిదామా అధికారులు చనిపోయిన వారి కుటంబాలకు సంతాపం తెలియజేస్తూ.. వారికి పూర్తి సమాచారం చేయవేయబడుతందని చెప్పారు.
ఈ ఘటన గురించి మరింత సమాచారాన్ని రాయిటర్స్ అంతర్జాతీయ మీడియా సేకరించింది. ఈ ఘటన సాయంత్రం 6 గంటలకు జరిగి ఉండవచ్చని.. అయితే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని తెలిపింది. వంతెన పై రోడ్డు సరిగా లేదని అందుకు ట్రక్కు డ్రైవర్లు వంతెన పక్క నుంచి వాహనాన్ని తీసుకెళ్లే క్రమంలో ప్రమాదం జరిగిందని రాయిటర్స్ కథనం.
చనిపోయిన వారందరూ సమీపంలోని ఒక గ్రామంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అయతే ట్రక్కులో పరిమితికి మించి జనం ఉన్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇథియోపియాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి ముఖ్యకారణం అక్కడ రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉండడమే.