Allu Arjun:పుష్ప-2(Pushpa-2) తో అల్లు అర్జున్ (Allu Arjun) పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఈ సినిమా కంటే ముందే అల్లు అర్జున్ కి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ లెవెల్ కి ఎదిగిపోయారు. రూ.1871 కోట్లు వసూలు చేసిన పుష్ప-2 సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.అయితే అలాంటి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నుంచీ వచ్చే సినిమాలన్నింటిపై ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న వారికి కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ను పుష్ప-2లో ఎలా అయితే చూపించారో.. ఆ లెవెల్ లోనే నెక్స్ట్ ప్రాజెక్టుల్లో చూపించాలి.ఒకవేళ ఏ మాత్రం తడబడినా.. సినిమాకి నెగిటివ్ టాక్ రావడం ఖాయం.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ (Trivikram)తో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అల్లు అర్జున్ సినిమాకు బడ్జెట్ కష్టాలు..
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆర్టిస్టులను కూడా వెతికే పనిలో పడ్డారట.ఇక త్రివిక్రమ్ బన్నీ సినిమా కాస్త పక్కన పెడితే.. అల్లు అర్జున్ చేతిలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) , అట్లీ (Atlee ) సినిమాలు కూడా ఉన్నాయి.ఇక త్రివిక్రమ్ తో పాటు అల్లు అర్జున్ అట్లీ (Atlee) సినిమాలో కూడా భాగం అవుతున్నారు. చాలా రోజుల నుండి అట్లీ, అల్లు అర్జున్ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటించట్లేదు. ఇక అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాకి సన్ పిక్చర్స్ (Sun Pictures ) నిర్మాణ బాధ్యత వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ అట్లీ సినిమా గురించి టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే అల్లు అర్జున్ , అట్లీ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.
నిర్మాతలకు తలనొప్పిగా మారిన బన్నీ రెమ్యూనరేషన్..
మరి ఇంతకీ అల్లు అర్జున్ సినిమాకి బడ్జెట్ కష్టాలు ఏంటయ్యా అంటే..అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకి దాదాపు రూ.250 కోట్ల పారితోషకం తీసుకున్నారు. తన నెక్స్ట్ సినిమాలు కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలే కాబట్టి ఆ సినిమా రెమ్యూనరేషన్లు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఇక అల్లు అర్జున్ ఒక్కరి రెమ్యూనరేషన్ రూ. 250 కోట్లు అంటే.. డైరెక్టర్ తో పాటు మిగతా ఆర్టిస్టులకు, సినిమా నిర్మించడానికి బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు అట్లీ పేరు కూడా జవాన్ (Jawan) సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించారు. ఈయనకి కూడా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. అటు బన్నీకి రూ.250 కోట్లు, అట్లీకి రూ. 100 కోట్లు. సుమారు రూ.350 కోట్లు వీరిద్దరి రెమ్యూనరేషన్లకే పోతే సినిమాలో నటించే ఇతర నటీనటులకు, సినిమా నిర్మించడానికి బడ్జెట్ ఇంకా ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అందుకే బడ్జెట్ విషయంలో సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ వాళ్ళు కాస్త వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.అలా బన్నీ సినిమాకి బడ్జెట్ కష్టాలు తప్పట్లేదని, బడ్జెట్ గురించి పూర్తిగా ఆలోచించుకున్నాకే సినిమాని అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. ఇక ఇందులో పూర్తి నిజా నిజాలు తెలియాల్సి ఉంది.