Double Chin: ఊబకాయం కారణంగా మీ చర్మంపై కొవ్వు తరచుగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా మీ చర్మం వదులుగా మారుతుంది. దీంతో మెడపై భాగంలో డబుల్ చిన్ పెరుగుతుంది. డబుల్ చిన్ మీ ముఖ అందాన్ని పాడు చేస్తుంది. అందుకే ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల కూడా డబుల్ చిన్ తగ్గుతుంది. మరి ఇంట్లోనే ఈజీగా డబుల్ చిన్ తగ్గడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డబుల్ చిన్ తగ్గడానికి:
డబుల్ చిన్ తగ్గడానికి వ్యాయామం చేయడానికి ఉత్తమ మార్గం అచ్చు వ్యాయామాలు. మీరు ఈ వ్యాయామం చేయడం ప్రారంభించినప్పుడు మీ గొంతుతో A, E, I, O, U అని ఉచ్చరించండి. ఇలా చేయడం వల్ల మీ కొవ్వు తగ్గుతుంది. ఇది కండరాలకు ఉపశమనం కలిగించి, డబుల్ చిన్‌ను
జిరాఫీ శైలి వ్యాయామం:
మీరు ఈ వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మొదట మీ వీపు , వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోండి. తరువాత నెమ్మదిగా వెనుకకు తీసుకోండి. మీ చేతిని కాలర్ బోన్ మీద ఉంచి ఇలా 10 నిమిషాల చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా డబుల్ చిన్ కూడా ఈజీగా తగ్గుతుంది.
మార్నింగ్ వాక్ :
ప్రతి రోజు ఉదయం మార్నింగ్ వాక్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అస్సలు మరచిపోవద్దు. అంతే కాకుండా మీ ఆహారంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినకండి. క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేయండి. ఇలా చేయడం ద్వారా డబుల్ చిన్ తగ్గుతుంది. అంతే కాకుండా మిమ్మల్ని మీరు ఫిట్‌గా కూడా ఉంచుకోవచ్చు.
ఫేస్ యోగా ఎలా పని చేస్తుంది ?
మన ముఖంలోని కండరాలు శరీరంలోని ఇతర కండరాల మాదిరిగానే ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అవి బలంగా, టోన్ గా మారుతాయి. ఫేస్ యోగాలో ముఖ కండరాలను సాగదీయడానికి, విడుదల చేయడానికి వివిధ రకాల యోగాలు ఉంటాయి. ఈ ఆసనాలు ముఖ కండరాలను ఉత్తేజపరుస్తాయి . అంతే కాకుంండా బలంగా కూడా మారుస్తాయి.
ఫేస్ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు:
ఫేస్ యోగా డబుల్ చిన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది .
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది- ఇది ముఖ చర్మాన్ని బిగుతుగా చేసి టోన్ చేస్తుంది. అంతే కాకుండా యవ్వనంగా ఉంచుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది – ఫేస్ యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది . అంతే కాకుండా ఇది చర్మానికి పోషణనిస్తుంది.
ముఖ రూపాన్ని మెరుగుపరుస్తుంది – ఇది డబుల్ చిన్ తగ్గించడం ద్వారా ముఖం యొక్క రూపాన్ని మెరుగుపరుస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది- ఫేస్ యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
సురక్షితమైనది, సహజమైనది – ఇది ఎటువంటి రసాయనాలు లేదా శస్త్రచికిత్స అవసరం లేని సురక్షితమైన, సహజమైన చికిత్స.
1. జా లైన్ వ్యాయామం:
మీ పెదాలను గట్టిగా మూసుకుని, నోటిని చేపలాగా చేయండి.
ఇప్పుడు మీ పెదాలను పైకి లాగి 10 సెకన్ల పాటు అలాగే ఉంచండి.
ఈ వ్యాయామాన్ని 10 సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల డబుల్ చిన్ తగ్గుతుంది.
2. కనుబొమ్మ లిఫ్ట్:
మీ కళ్ళు మూసుకుని, మీ కనుబొమ్మలను పైకి లేపండి.
10 సెకన్ల పాటు అలాగే ఉంచి, ఆపై విశ్రాంతి తీసుకోండి.
ఈ వ్యాయామాన్ని 10 సార్లు చేయండి.
Also Read: షుగర్ పేషెంట్లకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువట, ఎందుకంటే ?
3. చీక్‌బోన్ లిఫ్ట్:
మీ వేళ్లను మీ బుగ్గల పైన ఉంచి తేలికగా నొక్కండి.
తర్వాత నోరు కొద్దిగా తెరిచి నవ్వండి.
10 సెకన్ల పాటు అలాగే ఉంచి, ఆపై విశ్రాంతి తీసుకోండి.
ఈ వ్యాయామాన్ని 10 సార్లు చేయండి.