BigTV English

Yellamma Movie: ఎల్లమ్మ మూవీపై బిగ్ లీక్ ఇచ్చిన నితిన్… ఫ్యాన్స్‌కు ఇక పండగే…

Yellamma Movie: ఎల్లమ్మ మూవీపై బిగ్ లీక్ ఇచ్చిన నితిన్… ఫ్యాన్స్‌కు ఇక పండగే…

Yellamma Movie.. ప్రముఖ జబర్దస్త్ (Jabardast) కమెడియన్ వేణు (Venu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం ప్రారంభమైన జబర్దస్త్.. ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది అంటే ఇలాంటి గొప్ప కమెడియన్స్ తో ప్రారంభమైన షో కాబట్టే అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ధనరాజ్, వేణు తోపాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఈ జబర్దస్త్ ద్వారానే కెరియర్ ప్రారంభించి, ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. జబర్దస్త్ ద్వారా భారీ పేరు సొంతం చేసుకున్న వేణు ‘బలగం’ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు అవార్డులు కూడా దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నాడు.


ఎల్లమ్మ మూవీ పై బిగ్ లీక్ రివీల్ చేసిన నితిన్..

ఇక ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో హీరో నితిన్ (Nithin) నటించబోతున్నట్లు తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ (Robinhood ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వెంకీ కుడుముల (Venky kudumula) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బ్యూటీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. కేతిక శర్మ (Kethika Sharma) స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రమోషన్స్ జోరుగా పెంచారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నితిన్ తన నెక్స్ట్ సినిమా ‘ఎల్లమ్మ’ మూవీ పై కూడా క్లారిటీ ఇచ్చారు. నితిన్ మాట్లాడుతూ..” ఇది కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ముఖ్యంగా ఒక నటుడికి చాలా ఛాలెంజింగ్ పాత్ర. ఇప్పుడు ఈ పాత్రను నేను అంతే ఛాలెంజ్ గా తీసుకొని చేయబోతున్నాను. మే లేదా జూన్ చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక త్వరలోనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి మీ ముందుకు వస్తాము” అంటూ నితిన్ తెలిపారు.


ఎల్లమ్మ మూవీ నుండి తప్పుకున్న సాయి పల్లవి..

ఇకపోతే ఈ సినిమాలో నితిన్ హీరోగా కన్ఫామ్ కాగా.. హీరోయిన్ గా అందాల భామ సాయి పల్లవి (Sai Pallavi) నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వేణు.. సాయి పల్లవికి కథ వినిపించడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, అటు బాలీవుడ్ లో ఈమె సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ డేట్స్ కుదరక తప్పుకుందని సమాచారం. ఇకపోతే ఇప్పుడు మేకర్స్ సాయి పల్లవి స్థానంలో ఇంకొక హీరోయిన్ ని తీసుకోవడానికి వెతుకులాట మొదలుపెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు హీరోయిన్ దొరికితే తప్ప ఈ సినిమా మే నెలలో షూటింగ్ ప్రారంభం కాదని చెప్పవచ్చు. ఇక సాయి పల్లవి ఈమధ్య ‘అమరన్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని, ఇటీవల నాగచైతన్యతో కలిసి ‘తండేల్’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాపై అంచనాలు పెంచుకుంది. ముఖ్యంగా హిందీ రామాయణ సినిమాలో సీత పాత్ర పోషిస్తుంది సాయి పల్లవి. ఈ క్రమంలోనే రెండు పడవల మీద ప్రయాణం రెండు చిత్రాలకు న్యాయం చేయలేక పోతానేమో అనే భయంతోనే ఆమె తప్పుకున్నట్లు సమాచారం అయితే నితిన్ మూవీ నుండి సాయి పల్లవి తప్పుకోవడంతో ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు . ఇక హీరోయిన్ దొరికితే తప్ప షూటింగ్ ప్రారంభించలేరని సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×