BigTV English

Nithiin: అవును ట్రాక్ తప్పాను.. ఇప్పుడు అలా కాదు.. ఆ కాన్ఫిడెంట్ ఏంటి బ్రో..

Nithiin: అవును ట్రాక్ తప్పాను.. ఇప్పుడు అలా కాదు.. ఆ కాన్ఫిడెంట్ ఏంటి బ్రో..

Nithiin: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న చాలామంది యంగ్ హీరోలకు సాలిడ్ హిట్ పడాలి. టైర్ 2లో ఉన్న చాలావరకు హీరోలు పెద్దగా హిట్స్ లేక వెనబడిపోయారు. టాలీవుడ్‌లో అంతా పాన్ ఇండియా హీరోల హవానే కొనసాగుతోంది. అందుకే వారికి పోటీగా సరైన హిట్స్ కొట్టాలని చాలామంది యంగ్ హీరోలు ఫిక్స్ అయ్యారు. అందులో నితిన్ కూడా ఒకడు. నితిన్ కెరీర్ అంతా 3 హిట్లు, 6 ఫ్లాపులు అన్నట్టుగానే కొనసాగుతూ వస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా తనే ఒప్పుకున్నాడు కూడా. ఇక త్వరలోనే ‘రాబిన్‌హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్.. తన లైనప్ గురించి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. వరుసగా హిట్స్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.


అదే కారణం

ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమానే ‘రాబిన్‌హుడ్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భీష్మ’ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే వీరి కాంబోలో మళ్లీ సినిమా అంటే అది కచ్చితంగా బాగుంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. పైగా ఇప్పటివరకు ఈ మూవీ నుండి విడుదలయిన పోస్టర్స్, గ్లింప్స్ కూడా పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఇది కూడా మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అవుతుందని, అందుకే హిట్ ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే తన కెరీర్‌లో ఎక్కువగా ఫ్లాప్స్ ఉండడానికి తన స్క్రిప్ట్ సెలక్షనే కారణమని నితిన్ సైతం ఒప్పుకున్నాడు.


ట్రాక్ తప్పాను

‘జయం’ అనే మూవీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు నితిన్. ఆ తర్వాత కేవలం లవర్ బాయ్ ఇమేజ్ కోసం కష్టపడకుండా అటు కమర్షియల్, ఇటు లవ్ స్టోరీలు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. కానీ హిట్స్ మాత్రం అంతంగా మాత్రంగానే వచ్చాయి. వరుసగా ఎన్నో ఫ్లాపుల తర్వాత మళ్లీ ‘ఇష్క్’తో కాస్త ఫామ్‌లోకి వచ్చాడు నితిన్. అదే విషయాన్ని తను కూడా ఒప్పుకున్నాడు. ‘‘ఇష్క్ ముందు ఫ్లాప్స్ ఉన్నాయి. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్‌తో ట్రాక్‌లోకి వచ్చాను. ఆ తర్వాత మళ్లీ ట్రాక్ తప్పాను. ఇప్పుడు నేను మళ్లీ స్క్రిప్ట్ సెలక్షన్‌పైనే వర్క్ చేస్తున్నాను’’ అంటూ తన తప్పు ఏంటో ఒప్పేసుకున్నాడు నితిన్.

Also Read: ఓటీటీలో సమంతకు అరుదైన గౌరవం.. వారికి కృతజ్ఞతలు అంటూ..

ట్రాక్‌లో పడ్డాను

ప్రస్తుతం తన లైనప్ గురించి కూడా చెప్పుకొచ్చాడు నితిన్ (Nithiin). ‘‘ఇప్పుడు రాబిన్‌హుడ్ (Robinhood), తమ్ముడు, ఎల్లమ్మతో పాటు విక్రమ్ కుమార్‌తో సినిమా ఉంది. అందుకే ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లో పడ్డానని నా ఫీలింగ్’’ అని చాలా నమ్మకంతో చెప్తున్నాడు నితిన్. ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ సినిమాలు నితిన్‌కు హిట్ తెచ్చిపెడతాయనే నమ్మకంతో ఉన్నా అవి రెండూ ఇప్పటికే చాలాసార్లు రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నాయి. పైగా షూటింగ్ విషయంలో కూడా చాలా బ్రేకులు పడ్డాయి. అందుకే మధ్యలో ‘రాబిన్‌హుడ్’పై ప్రేక్షకుల్లో బజ్ పోయింది. మళ్లీ ఆ బజ్ క్రియేట్ చేయడం కోసం దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నితిన్ కలిసి వెరైటీగా ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×