BigTV English

Hero Raja Sekhar : సపోర్ట్ రోల్స్ కి కూడా రెడీ అంటున్న ఒకప్పటి యాంగ్రీ పోలీస్ మాన్…

Hero Raja Sekhar : సపోర్ట్ రోల్స్ కి కూడా రెడీ అంటున్న ఒకప్పటి యాంగ్రీ పోలీస్ మాన్…
Hero Raja Sekhar

Hero Raja Sekhar : డాక్టర్ రాజశేఖర్ ఇప్పటి వారికి ఒక సీనియర్ నటుడిగా మాత్రమే పరిచయం ఉన్న రాజశేఖర్ ఒకప్పటి తరం వారికి స్టార్ హీరోగా బాగా తెలుసు . తండ్రి కోరిక మేరకు వైద్యవృత్తిని అభ్యసించిన రాజశేఖర్ సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ వైద్య వృత్తిపై ఆసక్తి కొనసాగిస్తూనే వచ్చారు. వందేమాతరం సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.


ముఖ్యంగా ఒక యాంగ్రీ యంగ్ మాన్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎక్కువ నటించిన రాజశేఖర్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంకుశం లో రాజశేఖర్ చేసిన పోలీస్ క్యారెక్టర్ నిజ జీవితంలో ఎంతోమంది పోలీసులకు ఆదర్శంగా నిలిచింది. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ సీనియర్ యాక్టర్ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు.

ట్రెండు మారుతూ రావడంతో క్రమంగా 90 లో స్టార్ హీరోలుగా చలామణి అయిన ఎందరో నటులు తమ స్టార్‌డమ్‌ను కోల్పోతూ వచ్చారు. అలాంటి నటులలో రాజశేఖర్ ఒక్కరు. ఒకరకంగా చెప్పాలి అంటే రాజశేఖర్ హీరోగా మార్కెట్ ఆగిపోయి దాదాపు చాలాకాలం గడుస్తోంది. ఒక దశ లో సినిమాలు సరిగ్గా ఆడక పోవడంతో ఉన్న ఇంటిని సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.


అయినా సినిమాపై మక్కువ పోగొట్టుకోలేక రీసెంట్ గా గరుడవేగా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజశేఖర్ . ఆ మూవీ సక్సెస్ అతనికి కాస్త సంతృప్తిని ఇచ్చింది. అయితే కల్కి మూవీ మాత్రం ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయింది. మరోపక్క అతనితో పాటు హీరోలుగా నటించిన ఒకప్పటి స్టార్ హీరోస్ జగపతిబాబు, శ్రీకాంత్.. ట్రెండు మార్పును గమనించి తమ వయసుకు తగ్గట్టుగా అన్న పాత్రలు ,విలన్ పాత్ర లు చేస్తూ మంచి సక్సెస్ సాధించారు.

రాజశేఖర్ కి ఇటువంటి పాత్రలకు ఆఫర్ రాలేదా అంటే వచ్చాయి…కానీ…ధృవ మూవీలో అరవింద స్వామి లాంటి డైనమిక్ రోల్స్ ఇస్తేనే చేస్తానని రాజశేఖర్ ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు. ఎందుకంటే ధృవ క్యారెక్టర్ లో విలన్ గా అరవింద స్వామి వేరియేషన్స్ తనకు బాగా సెట్ అవుతాయని అతని అభిప్రాయం. ఎట్టకేలకు రాజశేఖర్ కు అతను అనుకున్న టైపు క్యారెక్టర్ దొరికినట్లు కనిపిస్తోంది.

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్‌లో రాజశేఖర్ కు మంచి ఆఫర్ వచ్చినట్లు టాక్. ఈ మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న రాజశేఖర్ షూటింగ్ చేయడానికి సెట్ కి కూడా వెళ్లాడని సమాచారం. ఒకప్పటి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ కు.. ఈ మూవీ తో తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. అదే గనుక జరిగితే ఒక మంచి టర్ను తిరిగి సినిమాలలో ప్రామినెంట్ రోల్స్ తో బిగ్ స్క్రీన్ పై చూశా అవకాశం కలుగుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×