BigTV English

Prema Vimanam Movie Review : ప్రేమ విమానం మూవీ.. ప్రేక్షకుల మనసులను విహంగ విహారం చేయిస్తుందా ?

Prema Vimanam Movie Review : ప్రేమ విమానం మూవీ.. ప్రేక్షకుల మనసులను విహంగ విహారం చేయిస్తుందా ?
Prema Vimanam Movie Review

Prema Vimanam Movie Review(Telugu Cinema News) :

రెండు  కథలు నడుమసాగే ప్రేమ విమానం మూవీ జి5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. మనసుకు హత్తుకునే కథనంతో సాగే ఈ చిత్రం ఇంతకీ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం పదండి….


స్టోరీ : ఒక పేద రైతు కుటుంబానికి చెందిన శాంత (అనసూయ భరద్వాజ్) కొడుకులు రాము (దేవాన్ష్ నామా), లక్ష్మణ్ (అనిరుధ్ నామా)కు చిన్నప్పటి నుంచి ఎప్పటికైనా విమానం ఎక్కాలి అన్న కోరిక ఉంటుంది. అయితే తమ ఆర్థిక పరిస్థితి రీత్యా మంచిగా పంటలు పండి డబ్బులు చేతికి వస్తే విమానం ఎక్కిస్తానని వాళ్ల తండ్రి (రవివర్మ) చెబుతూ ఉంటాడు. మరోపక్క ఆ ఊరికి ఒక పెద్ద ఉంటాడు. అతని కూతురు అభిత (సాన్వీ మేఘన). అదే ఊరికి చెందిన మణి (సంగీత్ శోభన్) తో ప్రేమ వ్యవహారం నడుపుతుంది.

అయితే ఇద్దరి మధ్య కులం పెద్ద అడ్డుగోడగా ఉండటంతో ఎప్పుడూ దొంగచాటుగా కలుసుకుంటూ ఉంటారు. ఎలాగైనా విమానం ఎక్కాలి అన్న కోరిక తీర్చుకోవడం కోసం తమ తల్లి దాచిపెట్టిన డబ్బులు తీసుకొని రాము, లక్ష్మణ్ ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ బయలుదేరుతారు. అలాగే పెద్దలను ఎదిరించే ధైర్యం లేక దుబాయ్ కి వెళ్లి పెళ్లి చేసుకోవాలని అభిత, మణి ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ కు వెళ్తారు.


ఇక అక్కడి నుంచి అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాము, లక్ష్మణ్ కు అసలు విమానం ఎక్కాలి అన్న కోరిక ఎప్పుడు ఎలా కలిగింది? ఇంటి నుంచి డబ్బు తీసుకొని పారిపోయిన ఆ ఇద్దరు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నారు? చివరికి వాళ్ళ కోరిక తీరిందా? వీళ్ళిద్దరి ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మణి ,అభిత ప్రేమ కథకు ముగింపు ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ ప్రేమ విమానం సినిమా కథ సమాధానం.

విశ్లేషణ : జర్నలిస్టు కావాలని కథల కోసం వెతుకుతున్న అమ్మాయికి ఆమె తల్లి ఇచ్చిన ఒక పుస్తకం నచ్చడంతో చదవడం మొదలు పెడుతుంది. అందులోని కథతో మొదలయ్యే ఇంట్రెస్టింగ్ కథనంతో చిత్రం ముందుకు సాగుతుంది. ఇందులో సెకండ్ హాఫ్ మొదలయ్యాక రాము, లక్ష్మణ్ తండ్రి చనిపోవడంతో వాళ్ళు పడే కష్టాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. మొత్తానికి హైదరాబాద్ చేరుకున్నాక ఈ నలుగురి జీవితాలలో ఒక భారీ ట్విస్ట్ మొదలవుతుంది. ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ పడే వరకు కథలోని మలుపులు చాలా ఇంట్రెస్టింగ్ గా , ఆసక్తికరంగా సాగుతాయి.

ఎప్పటిలాగానే అనసూయ భరద్వాజ్ మరోసారి ఈ చిత్రంలో ఒక ఎమోషనల్ పాత్రలో కనిపించింది. భర్తను కోల్పోయిన ఇద్దరు పిల్లలకు తల్లిగా ఆ పాత్రకు తన వంతు న్యాయం చేసింది. ఒక పక్క పిల్లల కోరికలు తీర్చలేక , కుటుంబ భారాన్ని మోయలేక నలిగిపోయే ఒక భావోద్వేగమైన పాత్రలో అనసూయ నటన అద్భుతం అని చెప్పవచ్చు. రాము, లక్ష్మణ్‌గా దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా వయసుకు మించిన నటన పరిపక్వతను కనబరిచారు. ఇక ఎప్పటిలాగానే సంగీత్ శోభన్ మంచి యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది.

పూర్తి గ్రామీణ వాతావరణంతో , మన తెలుగుతనానికి ఎంతో దగ్గరగా, ఒక మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలను.. జీవితంలో ఎదుర్కొనే చిన్ని చిన్ని సమస్యలను లవ్ , కామెడీ తో మేలవించి ఒక ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కించిన చిత్రమే ప్రేమ విమానం. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ 30 నిమిషాలు ఒక ఎత్తు. ఊహించని ట్విస్ట్ తో థ్రిల్లింగ్‌గా, కొత్తగా అనిపిస్తుంది. ప్రేమ విమానం..ఈ మధ్యకాలంలో హంగులు ఆర్భాటాలు లేకుండా నిజ జీవితంలో జరిగే ఎమోషన్స్ ను ఎలివేట్ చేస్తూ తీసిన చిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మూవీ : ప్రేమ విమానం

నటీనటులు : సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా .

నిర్మాత: అభిషేక్ నామా 

బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్, జీ5

డైరక్టర్: సంతోష్ కటా

టాగ్ లైన్ :ఈ వీకెండ్ , పండుగ సెలవుల్లో కుటుంబంతో కలిసి మంచి మూవీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రేమ విమానం మూవీని చూడండి. ఈ ఫీల్ గుడ్ మూవీ మనసుకు హత్తుకుంటుంది.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×