IPL 2025 franchises: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభం ఈనెల 17వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు మళ్లీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. విదేశాలకు వెళ్లిన ప్లేయర్లను ఇండియాకు తీసుకువచ్చేందుకు పది ఫ్రాంచైజీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అయితే రకరకాల కారణాల వల్ల విదేశాలకు వెళ్లిపోయిన ప్లేయర్లు ఇండియాకు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన పది ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నాయి. కోట్లకు కోట్లు డబ్బులు పెడితే ఇప్పుడు మళ్లీ ఆ ప్లేయర్లు రావడం లేదని చెబుతున్నారు.
ALSO READ: MI’s 4th IPL Title: కాలుకు 7 కుట్లు..రక్తం కారుతోంది..అయినా ముంబైపై వాట్సన్ వీరోచిత బ్యాటింగ్
ఐపీఎల్ పై ఆస్ట్రేలియా కొత్త కుట్రలు
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడడంతో… విదేశీ ప్లేయర్ లందరూ తమ దేశాలకు వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. ప్లేయర్లు అందరినీ రావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త కుట్రలకు తెర లేపుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు… ఇండియాకు రావడం కష్టమేనని చెబుతోంది. తమ ప్లేయర్లపై ఒత్తిడి పెట్టి తీసుకు వెళ్ళకూడదని కూడా హెచ్చరించింది. ఒకవేళ వాళ్లు… పది ప్రాంచీలకు తీవ్రని దెబ్బ. హెడ్, కమిన్స్, హేజిల్ వుడ్, పాట్ కమీన్స్ లాంటి ప్లేయర్లు ఈ మెగా టోర్నమెంట్ కు దూరం అవుతారు.
WTC ఎఫెక్ట్
ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీ నుంచి ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో.. ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు… లండన్ కు కాస్త ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే జూన్ మూడో తేదీన ఐపీఎల్ ఫైనల్ ఉంది. ఈ ఫైనల్ అయిపోయే వరకు ఈ ప్లేయర్లు… ఇండియాలో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ లెక్క ప్రకారం సౌత్ ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియా ప్లేయర్లు తొందరగానే టోర్నమెంట్ నుంచి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ టెన్షన్ కూడా 10 రాంచీల ఓనర్ల పై ఉంది.
ఇంగ్లాండ్ ప్లేయర్లు దూరం
ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య త్వరలోనే మ్యాచులు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తమ దేశాలకు వెళ్లిపోయిన ఇంగ్లాండ్ అలాగే వెస్టిండీస్ ప్లేయర్లు మళ్ళీ ఐపీల్ ఆడేందుకు వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే బట్లర్, క్లాసెన్, లివింగ్ స్టోన్ బెత్తలే లాంటి ప్లేయర్లు కూడా దూరం అవుతారు. ఇలా ప్రతి విదేశీ జట్టుకు ఒక్కో సమస్య ఉంది. అందుకే 10 ఫ్రాంచైజీల జట్ల ఓనర్లు తెగ టెన్షన్ పడుతున్నారు.