Suma:బుల్లితెర మహారాణి యాంకర్ సుమా కనకాల (Suma kanakala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో గత కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతున్న ఈమె ఒక టీవీ షోలే కాకుండా.. స్టార్ హీరోల సినిమాలను మొదలుకొని యంగ్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ.. వాటి సక్సెస్ కు కారణమవుతోంది. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం తమ సినిమా ఈవెంట్లకు సుమా వస్తోంది అంటే కచ్చితంగా ప్రిపేర్ అయ్యి వస్తారనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే సుమా తన వాక్చాతుర్యంతో ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా చిలక పలుకులతో అందరినీ కడుపుబ్బా నవ్వించే సుమ గొంతు మూగబోయిందని మీకు తెలుసా.. ? గత పది రోజులుగా అలాంటి సమస్యతో ఆమె బాధ పడుతోందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయాన్ని సుమ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఓకల్ నాడ్యూల్స్ సమస్యతో బాధపడిన సుమా..
అసలు విషయంలోకి వెళితే.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమా.. గతంలో తన వాయిస్ కి ఎఫెక్ట్ వచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇకపోతే గతంలో అని తెలిసి అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక సుమా మాట్లాడుతూ..” నాకు వోకల్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ నా వాయిస్ కి రెస్ట్ ఇవ్వమని చెప్పారు. దాంతో పది రోజులు నా గొంతు మూగబోయింది. మౌనవ్రతం చేశాను. నా వోకల్ కార్డ్స్ లో స్మాల్ బంప్స్ రావడం వల్ల అసలు మాట్లాడకూడదని వైద్యులు అన్నారు. దాంతో పది రోజులపాటు మాట్లాడకుండా ఉన్నాను. ఇక వోకల్ నాడ్యూల్స్ అంటే గొంతులో మాట్లాడడానికి సహాయపడే నరాలకు వచ్చే సమస్య. తరచూ రెస్ట్ లేకుండా మాట్లాడడం, అరవడం లాంటివి చేస్తే ఈ సమస్య వస్తుందట..” అంటూ తెలిపింది. ఇకపోతే సుమా రోజు షోలలో ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి ఆమెకు ఈ సమస్య వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకోవడం, మాట్లాడకుండా ఉండడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడ్డాను అని సుమా తెలిపింది. ఇక ప్రస్తుతం సుమా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అతిగా మాట్లాడితే ఇలాంటి సమస్యలు వస్తాయని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
సుమా కనకాల కెరియర్..
సుమా విషయానికి వస్తే.. ‘భలే ఛాన్సులే’ అనే షో ద్వారా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత స్టార్ మహిళ , క్యాష్, పట్టుకుంటే పట్టు చీర ఇలా ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించి, స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. తన కామెడీతో, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. అటు సినిమాలలో కూడా నటించింది. మొదట సినిమాల ద్వారానే కెరియర్ ఆరంభించి ఆ తర్వాత బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఒక్కో షోకి రూ.5నుండి రూ.6లక్షల రేంజ్ లో పారితోషకం తీసుకునే ఈమె.. ఈవెంట్లకు పెద్ద మొత్తంలోనే పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
ALSO READ:Balakrishna: భాష మార్చిన బాలయ్య.. ఈ వయసులో రిస్క్ చేస్తున్నారేమో?