BigTV English

Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహర్తం ఫిక్స్.. ఏ రోజున అంటే..?

Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహర్తం ఫిక్స్.. ఏ రోజున అంటే..?

Date Fixed for reopening Anna Canteens: ఏపీ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్య క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నది. ఇందుకు సంబంధించి మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు. పంద్రాగస్టు రోజున అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను పంద్రాగస్టు 15న సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజు అనగా ఆగస్టు 16న మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని ఆయన వివరించారు.


Also Read: మందుబాబులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు.. క్వార్టర్ ధర రూ. 80?

ఇదిలా ఉంటే.. వైద్య ఆరోగ్యశాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో ఉత్తమ్ విధానాలను అమలు చేయాలి. టెలీ మెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను పూర్తిగా భ్రష్టు పట్టించింది. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలి. ఆసుపత్రుల్లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలి. ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను ఆసుపత్రులకు తరలించాలి. క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి’ అంటూ ఆయన అధికారులను ఆదేశించారు.


Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×