Manchu Vishnu : టాలీవుడ్ ను ఏలేస్తున్న సిని కుటుంబాల్లో ఒకటి మంచు ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu ) తర్వాత తన కుమారులు కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబు వారసత్వంగా వచ్చిన వీళ్లు ముగ్గురు ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయారు. ప్రతి ఒక్కరూ హిట్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ఇక మంచు విష్ణు ( Manchu Vishnu ) రీసెంట్ గా తన డ్రీం ప్రాజెక్టు కన్నప్ప తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచి విష్ణు తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
కన్నప్ప మూవీ..
మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప మూవీని చేస్తున్నాడు. ఇందులో విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి టీజర్ వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్ అంతా కొట్టుకుపోయింది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. కన్నప్ప సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికీ నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్నా. అయినా సక్సెస్- ఫెయిల్యూర్ రెండూ మోసగాళ్లే.. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ మూవీలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్స్ అందరూ నటిస్తున్నారు.
Also Read : సూర్య చెల్లెలుకు, అలియాభట్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
మంచు విష్ణు పై ట్రోల్స్..
మంచు విష్ణు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి ప్రస్తావించారు. నేను చేస్తున్న ఈ ప్రాజెక్టు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని కోరుకోమంటే నేను మోహన్ బాబుని మళ్లీ తండ్రిగా ఇవ్వాలని కోరుకుంటానని ఆయన అన్నారు. మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం.. ఇక ట్రోలింగ్ విషయానికొస్తే ఇలాంటివి ప్రతి ఇంట్లోనే ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవడంతో మంచు విష్ణు పై నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారని తెలుస్తుంది. మంచు విష్ణు ఎంత జరిగినా కూడా నువ్వు మీ తండ్రిని వెనకేసుకొస్తున్నావు.. కొంచెం అయినా అవతలి వ్యక్తి ఆవేదనలను ఆలోచించు అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి మంచు విష్ణు ఇంటర్వ్యూ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గురించి ఇప్పటివరకు అయితే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది ఇక రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ నందుకు ఉంటుందో చూడాలి..