Dhanush: తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయమే. ఎందుకంటే ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్నా కూడా చూడటం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటినుంచో అలవాటు అయిపోయింది. సినిమాను తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతగా వేరే ఇండస్ట్రీ ప్రేక్షకులు ప్రేమించరు అనేది వాస్తవం. తెలుగు హీరోలకి ఎంత డిమాండ్ ఉంటుందో చాలామంది తమిళ్ హీరోల సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తూ వాళ్లకి మంచి ఓపెనింగ్స్ కట్టబెట్టడంలో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. ఇది కేవలం మనం అనుకున్న మాటలు మాత్రమే కాదు. చాలామంది స్టార్ హీరోలు సైతం ఈ మాటలను చెబుతూ ఉంటారు. అమితాబచ్చన్ లాంటి వారి తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి అని చాలా సార్లు చెప్పారు.
తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ ధనుష్. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన త్రీ (3) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా కంటే ముందు అనిరుద్ కంపోజ్ చేసిన కొలవరెడి అనే పాట ఒక సంచలనం గా మారింది. కొన్ని మిలియన్స్ వ్యూస్ ఆ పాటకి వచ్చాయి అక్కడితోనే సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక తర్వాత ధనుష్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించక పోయినా కూడా. ధనుష్ మైల్ స్టోన్ ఫిల్మ్ గా వచ్చిన రఘువరన్ బీటెక్ (Raghuvaran BTech) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అప్పటినుంచి ధనుష్ చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చింది.
Also Read: Kanguva Bookings: ప్రీ బుకింగ్స్ విషయంలో ‘కంగువ’ సంచలనం.. అమెరికా నుండే మొదలు
రీసెంట్ గా ధనుష్ తెలుగులో సార్ సినిమాను చేశాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) లో కూడా ఒకసారి కొత్త కోణాన్ని బయటకు తీసిన సినిమా ఇది.ఇక ధనుష్ తన కెరియర్లో 50వ సినిమాను రీసెంట్ గా పూర్తి చేసుకున్నాడు. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రాయన్(Rayan) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించి కోట్లు కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం ధనుష్ ఆనంద్ దర్శకత్వంలో తేరే ఇష్క్ మే అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ను ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమాను చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ అన్నీ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించాయి. కింగ్ నాగార్జున ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.