BigTV English

Kanguva Bookings: ప్రీ బుకింగ్స్ విషయంలో ‘కంగువ’ సంచలనం.. అమెరికా నుండే మొదలు

Kanguva Bookings: ప్రీ బుకింగ్స్ విషయంలో ‘కంగువ’ సంచలనం.. అమెరికా నుండే మొదలు

Kanguva Bookings: కోలీవుడ్‌కు గుర్తుండిపోయే హిట్ ఇవ్వాలని హీరో సూర్య రంగంలోకి దిగాడు. అంతకు ముందు సూర్య నటించిన సినిమాలు కమర్షియల్‌గా అంత సక్సెస్ సాధించకపోయినా.. రెండేళ్ల పాటు ఒక డైరెక్టర్‌ను నమ్ముకొని తన కాల్ షీట్స్‌ను అప్పజెప్పాడు. అలా సూర్య, శివ కాంబినేషన్‌లో ‘కంగువ’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు మేకర్స్. అందుకే ప్యాన్ ఇండియా స్థాయిలో ‘కంగువ’ హిట్ అవ్వాలని ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేశమంతా చుట్టేస్తూ ఈ సినిమాను చూడమని ప్రేక్షకులకు చెప్తుండగా అమెరికాలో ‘కంగువ’ ప్రీ బుకింగ్స్ మేకర్స్‌ను హ్యాపీ చేస్తున్నాయి.


ప్రీ బుకింగ్స్ మొదలు

అమెరికాలో ఇండియన్ హీరోలకు బాగానే మార్కెట్ ఉంది. కంటెంట్ బాగుంటే అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలను సపోర్ట్ చేస్తారు. అలా ఇప్పటికే అమెరికాలో ఇండియన్ సినిమాలు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ‘కంగువ’కు ప్రమోషన్స్ బాగా జరగడంతో అక్కడ కూడా ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. అందుకే ప్రీ బుకింగ్స్ విషయంలో ఈ మూవీ దూసుకుపోతోంది. తాజాగా అమెరికాలో ప్రీ బుకింగ్స్ వల్ల ‘కంగువ’ ఎంత కలెక్ట్ చేసిందో మేకర్స్ స్వయంగా రివీల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. యూఎస్‌లో కూడా తమిళంతో పాటు ఇతర సౌత్ భాషల్లో ‘కంగువ’ (Kanguva) విడుదలకు సిద్ధమయ్యింది.


Also Read: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. ప్లానింగ్ మాత్రం అదుర్స్

కష్టపడుతున్న సూర్య

అమెరికా వ్యాప్తంగా ‘కంగువ’ ప్రీ బుకింగ్స్‌ వల్ల 125 వేల డాలర్లు కలెక్ట్ అయ్యిందని, ఇంకా ఈ ప్రీ బుకింగ్స్ కొనసాగుతున్నాయని మేకర్స్ ప్రకటించారు. దీంతో సైలెంట్‌గానే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసేలా ఉందని సూర్య (Suriya) ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మామూలుగా తాను నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా సూర్య ఈ రేంజ్‌లో కష్టపడలేదు. ఇప్పుడు ఈ మూవీని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం ప్రతీ భాషలో ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నాడు. తెలుగులో కూడా పలుమార్లు ప్రెస్ మీట్‌లో పాల్గొని, తెలుగు స్టార్లను పర్సనల్‌గా కలిసి ‘కంగువ’ను ప్రమోట్ చేసుకుంటున్నాడు సూర్య. ఈ మూవీ విడుదలకు ఇంకా కొన్నాళ్లే ఉండగా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు.

పాజిటివ్ టాక్ చాలు

‘కంగువ’ మూవీ 2024 సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. ముందుగా ఈ సినిమా విడుదల సమ్మర్‌లోనే ఉంటుందని తేదీతో సహా ప్రకటించారు. కానీ అప్పటికీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో మూవీ పోస్ట్‌పోన్ అవ్వాల్సి వచ్చింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ చిత్రమని అప్పటికి ప్రేక్షకులకు తెలియదు. ఆ తర్వాత ‘కంగువ’ పోస్టర్‌లో సూర్య రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించడంతో ఆడియన్స్‌కు క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటికీ ఈ మూవీ అసలు హిట్ అవుతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నవారు కూడా ఉన్నారు. తన చేతిలో ఉన్నంత వరకు ప్రమోషన్స్ చేశాడు సూర్య. ఒకవేళ ‘కంగువ’కు మొదటి నుండే పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×