దీర్ఘకాలికంగా మలబద్ధకం బారిన పడితే మీ పొత్తికడుపు, అవయవాలు నొక్కుకుపోయినట్టు అవుతాయి. ఇవి వెన్నెముకలోని నరాలకు కూడా అంతరాయం కలిగిస్తాయి. వాటిపై ఒత్తిడి పడేలా చేస్తాయి. అలాగే పేగులోని మలం బయటకు వెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడుతాయి. ఇవన్నీ కూడా శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
మలబద్ధకం అనేది తేలిగ్గా తీసుకునే సమస్య కాదు. మెదడులో ట్యూమర్లు ఏర్పడే దిశగా కూడా ఇది శరీరాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఆహారం, ఒత్తిడి, డిహైడ్రేషన్, జీవనశైలి కారకాల వల్లే మలబద్ధకం కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇవి దీర్ఘకాలికంగా మారితే మాత్రం వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకొని ఆహార పద్ధతులను కూడా మార్చుకోవాలి. మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది అలాగే పేగు క్యాన్సర్ కూడా రావచ్చు. జీర్ణ వ్యవస్థ పై మలవద్దకం అనేది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
మలబద్ధకంతో పాటు మలంలో రక్తం కారడం, విపరీతంగా బరువు తగ్గిపోవడం, పొత్తికడుపులో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల్ని కలిసి తగిన చికిత్స తీసుకోవలసిన అవసరం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఒక అధ్యయనంలో మలబద్ధకం ఉన్నవారికి జీర్ణాశయంతర ట్యూమర్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అలాగే పెద్ద పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉందని కనిపెట్టారు. ఈ రెండు క్యాన్సర్లు కూడా ప్రాణాంతకమైనవి. కాబట్టి మలబద్ధకాన్ని మీరు తేలికగా తీసుకోవద్దు.
మీకు దీర్ఘకాలంగా వివరించలేని మలబద్ధకం ఉంటే వెంటనే వైద్యులను కలిసి తగిన స్క్రీనింగ్ తీసుకోవాలి. దానికి ముఖ్య కారణం తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. మూడు రోజులు కంటే ఎక్కువ కాలం మీకు మలబద్ధకంగా ఉంటే అది కాలక్రమంగా తీవ్రమైపోయే అవకాశం ఉంది. తీవ్రంగా అలసట పడడం, కడుపులో అసౌకర్యంగా ఉండడం, బరువు పెరగకపోవడం, బరువు తగ్గిపోవడం, కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండడం వంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నది.
ఆధునిక కాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందరూ అందానికి ఇస్తున్నంత ప్రాముఖ్యత ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. ముఖ్యంగా మలబద్ధకం వంటటి సమస్యలను అసలు పట్టించుకోవడం లేదు. అందుకే ఎక్కువమంది తమకు తెలియకుండానే క్యాన్సర్ బారిన పడ్డ పెడుతున్నారు. ముందే దీనిని నివారించుకుంటే ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది.