Srikanth Odela: సినీ పరిశ్రమలో టాలెంట్ మాత్రమే కాదు.. లక్ కూడా ఉండాలి. ఒక్క అవకాశం రావడానికి ఎంత టాలెంట్ కావాలో అంతే లక్ కూడా ఉండాలి. అలా టాలెంట్ ఉన్నవారిని అవకాశం ఇవ్వడానికి నాని ఎప్పుడూ ముందుంటాడు. తను దర్శకుడిగా పరిచయం చేసిన ఎంతోమంది ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ సినిమాకు దర్శకుడిగా శ్రీకాంత్‌కు అవకాశమిచ్చాడు నాని. దానివల్ల ఈ దర్శకుడి లైఫే మారిపోయింది. అంతే కాకుండా మరోసారి శ్రీకాంత్ ఓదెలకు అవకాశమిచ్చి తనపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు నాని. ఇంతలోనే ఒక్క సినిమా హిట్ అయిందనే పొగరుతో నోరుజారాడు శ్రీకాంత్.
టైటిల్ వల్లే
‘దసరా’ సినిమాతో డెబ్యూ చేసిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela).. దాని ద్వారా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత తనకు మరో హీరో అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నానినే పిలిచి అవకాశం ఇచ్చాడు. ఇటీవల వీరి కాంబినేషన్‌లో ‘నాని ఓదెల 2’ కూడా ప్రారంభమయ్యింది. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి దీనిపై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఇంతలోనే ఈ మూవీ టైటిల్ ‘ప్యారడైజ్’ (Paradise) అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ‘ప్యారడైజ్’ అనే టైటిల్‌తో నాని ఓదెల 2 తెరకెక్కుతుందని మేకర్స్ కూడా ప్రకటించారు. కానీ అంతకంటే ముందే సోషల్ మీడియాలో టైటిల్ లీక్ అవ్వడంపై శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: తెలుగమ్మాయి మరో మెగా ఛాన్స్ పట్టేసిందిగా..
అప్పుడే బజ్
‘ప్యారడైజ్’ అనే టైటిల్‌ను ముందే లీక్ చేసిన వారిని బూతులు తిట్టాడు శ్రీకాంత్ ఓదెల. మామూలుగా నాని (Nani) సినిమా అంటే అది షూటింగ్ జరుగుతున్నప్పుడు, పూర్తయిన తర్వాత పెద్దగా బజ్ ఉండదు. కానీ విడుదలకు ముందు ప్రమోషన్స్ బాధ్యతను తనే పూర్తిగా తీసుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేసుకుంటాడు. అలాంటి నాని సినిమకు శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్ నెగిటివ్‌గా మారనుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ముఖ్యంగా ఒకే ఒక్క సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న దర్శకుడు.. ఇలాంటి పదాలు వాడడం తన భవిష్యత్తుకే మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలియకుండానే జరిగిందా
మామూలుగా నానికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో.. తను ఏం చేసినా నెగిటివిటీ పెంచే హేటర్స్ కూడా అదే సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడిన బూతుల గురించి నానికి తెలియదా, తెలిసే అలా మాట్లాడడానికి ఒప్పుకున్నాడా అంటూ తనపై బుదర చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమాలకు సంబంధించిన లీక్స్ రావడం కొత్త విషయం ఏమీ కాదు. అయినా కూడా శ్రీకాంత్ ఓదెల బయటికొచ్చి తన సినిమా టైటిల్ గురించి లీక్ చేసిన వారిని అంత పెద్ద బూతు మాట అనడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ ఆ టైటిల్ లీక్ అయినప్పుడు, రివీల్ అయినప్పుడు కంటే శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ వల్లే దీని గురించి హాట్ టాపిక్‌గా మారిందని తెలుస్తోంది.