ప్రతి సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది సమాజానికి భయపడి, ఇండస్ట్రీలో అవకాశాలు రావని, ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. కానీ మరికొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి, ఇండస్ట్రీలో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ధైర్యంగా ముందుకొచ్చి, ఒక కన్నడ హీరో పై ఊహించని కామెంట్లు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే..2008లో రెబల్ స్టార్ ప్రభాస్(Prabha), ప్రముఖ బ్యూటీ త్రిష(Trisha) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘బుజ్జిగాడు’. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ప్రముఖ బ్యూటీ సంజనా గల్రానీ (Sanjjanaa Galrani).
డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలు జీవితం అనుభవించిన సంజనా..
కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు,తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక దాంతో కన్నడలో బిజీ అయిపోయింది. అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలు జీవితాన్ని కూడా అనుభవించింది. ఇక తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె.. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టివేసింది. ఇకపోతే ఈ డ్రగ్స్ కేస్ పంచాయతీ నడుస్తున్నప్పుడే.. బెంగళూరుకి చెందిన ఒక ముస్లిం డాక్టర్ అజీజ్ పాషా అనే వ్యక్తితో 2020 కరోనా సమయంలో వివాహం జరిగింది. 2022 మే నెలలో పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
కన్నడ హీరో పై ఊహించని కామెంట్స్..
ఇదిలా ఉండగా గతంలో ఒక తెలుగు ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ హీరో గురించి ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.సంజనా గల్రానీ మాట్లాడుతూ.. “కన్నడలో ఒక స్టార్ హీరో కారణంగా నేను టార్చర్ చూశాను. అయితే అతను చాలా ఫ్రస్టేషన్ ఉన్న హీరో.. అతడి పేరు చెప్పను కానీ అతడితో నాకు ఒక సీన్ ఉంది. డాన్స్ చేస్తున్నట్టు, నా భుజాలు పట్టుకొని కదపాల్సి ఉంటుంది. అదే సమయంలో.. అతనికి డైరెక్టర్ కి గొడవ నడుస్తూ ఉండగా.. యాక్షన్ చెప్పాడు. దాంతో అతడు వచ్చి, నా చేతి భుజాల వద్ద పట్టుకొని అలా చేశాడు. డ్యూడ్.. చూడు ఇంత గట్టిగా నొక్కకు.. నాకు నొప్పిగా ఉంది అని నేనంటే.. సారీ మేనేజ్ చేసుకో అన్నాడు. నేను ఇలా దెబ్బలు తినడానికి హీరోయిన్ గా రాలేదు. నిజానికి కొన్నిసార్లు ఇలాంటి తిక్క క్యాండిడేట్లు దొరుకుతారు అంటూ సంజన తెలిపింది. ఇక తర్వాత అతడితో ఒక అరగంట మీతో నేను షూట్ చేయను. ఇదేమి యాక్షన్ సీక్వెన్స్ కాదు కదా.. మీకు ఎదురుగా దొరికే రౌడీని నేను కాదు అంటూ చెప్పి వెళ్లిపోయాను” అంటూ సంజనా కామెంట్లు చేసింది. మరి సంజనా కామెంట్ చేసిన ఆ హీరో ఎవరు? అనే విషయం మాత్రం ఆమె బయట పెట్టలేదు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.