BigTV English

Maha Kumbh Mela: రూ. 7,500 కోట్లు ఖర్చు.. రూ. 2 లక్షల కోట్ల ఆదాయం, భళా.. మహా కుంభమేళా!

Maha Kumbh Mela: రూ. 7,500 కోట్లు ఖర్చు.. రూ. 2 లక్షల కోట్ల ఆదాయం, భళా.. మహా కుంభమేళా!

Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక సంబురం మహా కుంభమేళా అట్టహాసంగా కొనసాగుతున్నది. జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక సుమారు 45 రోజుల పాటు కొనసాగనుంది. ప్రయాగరాజ్ లో జరిగే ఈ వేడుకలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు సుమారు 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు అనుగుణంగానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. కుంభమేళా జరిగే ప్రాంతంలో 7 అంచెల భద్రత కొనసాగిస్తున్నది. సుమారు 50 వేల మంది పోలీసులను మోహరించింది యోగీ సర్కారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా 24/7 ఏఐ సీసీ కెమెరాలు డేగ కళ్లతో పర్యావేక్షిస్తున్నాయి.


రూ. 7,500 కోట్లు ఖర్చు.. రూ. 2 లక్షల కోట్ల ఆదాయం

ఇక మహా కుంభమేళా కోసం యూపీ సర్కారు ఏకంగా రూ. 7,500 కోట్లు కేటాయించింది. భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించింది. ఈ 45 రోజుల మహా వేడుక ముగిసే సరికి ఏకంగా రూ. 2 లక్షల కోట్లుకు పైగా ఆదాయం లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 45 కోట్ల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరు రూ. 5 వేలు ఖర్చు చేసిన రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలుకడుతున్నాయి. ఈ వేడుక వేళ స్థానిక హోటళ్లు, అతిథి గృహాలు, లాడ్జీలకు సమారు రూ. 40 వేల కోట్లు ఆదాయం వస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CIAT) అంచనా వేస్తోంది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సర్వీసుల ద్వారా రోజుకు రూ.3.5 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపింది.


మహా కుంభమేళాతో పెద్ద మొత్తంలో ఆదాయం

ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. “మహా కుంభమేళా ద్వారా యూపీకి పెద్ద మొత్తంలో ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఈ వేడుకలో పాల్గొనే భక్తులు ఒక్కొక్కరు  సగటున రూ. 5 వేలు ఖర్చు చేసినా.. రూ. 2 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుంది. వీటిలో హోటళ్ళు, అతిథి గృహాలు, తాత్కాలిక వసతి, ఆహారం, మతపరమైన వస్తువుల కొనుగోలు, ఆరోగ్య సంరక్షణతో పాటు పలు రకాల ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. ఫుడ్, బేవరేజెస్ రంగానికి రూ, 20 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు.

మహా కుంభమేళాలో బ్రాండ్లు

మహా కుంభమేళాలో అన్ని రంగాలకు చెందిన కంపెనీలు తమ బ్రాండ్లను ప్రదర్శిస్తున్నాయి. డెటాల్, డాబర్, పెప్సికో, కోకా కోలా, స్ట్రింగ్, మౌంటైన్ డ్యూతో పాటు ఐటీసీ, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇందుకోసం యూపీ సర్కారుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నాయి. మొత్తంగా మహా కుంభమేళాతో ఓవైపు ఆధ్యాత్మిక పురోగతితో పాటు మరోవైపు ఆదాయం పొందడం విశేషం.

Read Also: మహా కుంభమేళాకు రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏకంగా 13 వేల రైళ్లు కేటాయింపు!

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×