BigTV English

Shankar: రూ. 450 కోట్లు ఖర్చు పెట్టించి.. సినిమాను డిజాస్టర్ చేసి.. ఇప్పుడు కవరింగా శంకర్ మావా

Shankar: రూ. 450 కోట్లు ఖర్చు పెట్టించి.. సినిమాను డిజాస్టర్ చేసి.. ఇప్పుడు కవరింగా శంకర్ మావా

Shankar:  స్టార్ డైరెక్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ డైరెక్టర్ అయినా కూడా ఆయన సినిమాల్ని తెలుగులో కూడా రిలీజ్ అయ్యి భారీ విజయాలను అందుకున్నాయి.  జెంటిల్ మ్యాన్, భారతీయుడు, ప్రేమికుడు, జీన్స్, ఒకే ఒక్కడు, రోబో, బాయ్స్, అపరిచితుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే శంకర్  తీసిన ప్రతి సినిమా భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అందుకే శంకర్ సినిమా అంటే ఫ్యాన్స్ లో వచ్చే హైప్ వేరేలా ఉంటుంది.


అయితే ఫ్యాన్స్ హైప్ పక్కన పెడితే.. శంకర్ తో సినిమా అంటే మాత్రం మేకర్స్ గుండెలు బద్దలవ్వాల్సిందే. అంత బడ్జెట్ చెప్తాడు.  సినిమా  మొత్తానికి కాదు.. ఒక్క పాటకే రూ. 50 కోట్లు  ఖర్చు చేయించగల సమర్థుడు శంకర్. డబ్బులు పోతేపోయాయి..  సినిమా హిట్ అయితే చాలు అనుకున్న నిర్మాతలు.. శంకర్ ఏది చెప్తే అది చేస్తారు. కానీ, అంత డబ్బు ఖర్చుపెట్టి కూడా లాభాలు రాలేదు అంటే.. నిర్మాత గుండె ఆగిపోవడమే. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో దిల్ రాజు గుండె గట్టిది కాబట్టి తట్టుకున్నాడు కానీ, వేరే నిర్మాత అయితే మరోసారి కంటికి కూడా కనిపించేవాడు కాదు.

కానీ, దిల్ రాజు మాత్రం అంతటి బాధను దిగమింగుకొని నవ్వుతూ కనిపిస్తున్నాడు.  గేమ్ ఛేంజర్ పరిస్థితి  రోజోరోజుకు అద్వానంగా తయారవుతుంది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. నెగిటివిటీతో ప్లాప్ గా మారింది. కొంతమంది సినిమా చాలా బావుందని చెప్తున్నా..  ఇంకొందరు శంకర్ లో పస లేదు అని ముఖం మీదనే చెప్పుకొస్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే.. గేమ్ ఛేంజర్  రిజల్ట్ పై చరణ్..  ఒక పాజిటివ్ పోస్ట్ పెట్టుకొచ్చాడు. సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ చిత్ర బృందానికి కూడా థాంక్స్ చెప్పాడు.


Mahesh Babu: పెద్దోడి సినిమాకు చిన్నోడి రివ్యూ.. బుల్లి రాజు గురించి ఏం చెప్పాడంటే.. ?

ఇక  శంకర్ మాత్రం.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్లు కనిపించాడు. తాజాగా  ఒక ఇంటర్వ్యూలో శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. ” టైమ్ సరిపోక చాలా ముఖ్యమైన సీన్స్‌ను నేను కట్ చేయాల్సి వచ్చింది. అసలైతే ఒరిజినల్ ఫుటేజ్ 5 గంటల కంటే ఎక్కువగా ఉంది. కానీ సినిమాను తక్కువ రన్ టైమ్‌లో విడుదల చేయడం కోసం చాలావరకు ట్రిమ్ చేశాం. గేమ్ ఛేంజర్ అవుట్ ఫుట్ నాకు నచ్చలేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో శంకర్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మూడేళ్లు సినిమా తీసావు.. రూ. 450 కోట్లు ఖర్చు  పెట్టించావు.. ఇప్పుడు చివర్లో 5 గంటల సినిమా .. ట్రిమ్ చేసావు అని చెప్తున్నావ్. ఇది నీకు న్యాయంగా ఉందా.. ?  నటీనటుల టైమ్, నిర్మాతల డబ్బు మొత్తం ఖర్చు చేసి.. ఇలాంటి ఒక అవుట్ ఫుట్ తీసుకొచ్చి.. ఇప్పుడు నెమ్మదిగా కూర్చొని కవర్ చేస్తున్నావ్. అంత నచ్చనప్పుడు ముందే ఆపేయాల్సింది కదా. లేదు అంటే  ఇంకా టైమ్ తీసుకొని అందరికీ నచ్చే సన్నివేశాలు పెట్టి.. 2 పార్ట్స్ గా రిలీజ్ చేయాల్సింది. సరే ఇదంతా  కాదు.. సినిమా ప్లాప్ అయ్యింది.   మిగతావారు అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇలా నీ తప్పు లేదు అని చెప్పడానికి ఇదంతా చెప్పడం న్యాయమేనా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×