Heroine Shriya : కొన్ని కథలపై ఎంతో నమ్మకాన్ని పెట్టి కొందరు నిర్మాతలు రిస్క్ చేసి మరి డబ్బులు పెడుతూ ఉంటారు. అయితే అన్నిసార్లు రిస్క్ వర్క్ అవుట్ అవుతుందని చెప్పలేం. ఎంతో నమ్మి చేసిన కొన్ని సబ్జెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతాయి. మినిమం కలెక్షన్స్ కూడా రాకుండా ఫెయిల్యూర్‌ని చవిచూస్తాయి. అలాంటి సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బోలెడు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వచ్చిన నరసింహుడు సినిమా అలాంటిదే అని చెప్పొచ్చు. 2005లో బి.గోపాల్ (B.Gopal) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అమీషా పటేల్ (Amisha Patel), సమీరా రెడ్డి (Sameera Reddy) ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ఓవర్ బడ్జెట్ కారణంగా లేటుగా రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం అద్భుతంగా వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే నరసింహుడు (Narasimhudu) తల్లిదండ్రులు చాలా చిన్న వయసులోనే చనిపోతారు. అతన్ని కొండవీడు గ్రామస్తులు దత్తత తీసుకుంటారు. వీరంతా అతని పెంచే బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఆ ఊర్లో ఒక బాలికపై అత్యాచారం చేస్తారు కొంతమంది దుండగులు. అయితే ఆ గ్రామాన్ని కాపాడుతున్న నరసింహుడు ఆ నేరానికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ ను నరసింహుడు ఎలా నిలబెట్టుకున్నాడనేది చిత్ర కథ. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది.
Also Read : డాకు మహారాజు ను పక్కన పెట్టి ఈ టైటిల్ పై కన్నేసిన టీం… ఆల్మోస్ట్ ఫిక్స్ ?
అయితే ఇప్పుడు ఈ సినిమా తెరపైకి రావడానికి గల కారణం ఏంటంటే సీనియర్ హీరోయిన్ శ్రియ (Shriya) ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో శ్రియా, జెనీలియా కలిసి నటించిన నా అల్లుడు సినిమా గురించి మాట్లాడింది. నేను జెనీలియా ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేశాము. ఆ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే డబ్బులు అయింది. షూట్ లాస్ట్ రోజు ఆయనకి ఏం చేయాలో తెలియక ప్రొడ్యూసర్ హుస్సేన్ సాగర్ లో దూకాడు. ఇంక నేను నా రెమ్యూనరేషన్ అడగలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే నా అల్లుడు (Naa Alludu) సినిమాకి నరసింహుడు సినిమాకి ఏంటి సంబంధం అని డౌట్ చాలా మందికి వచ్చి ఉండొచ్చు. నరసింహుడు సినిమాను నిర్మించిన చెంగల వెంకట్రావ్ (Chengala Venkatrao) అనే నిర్మాత కుటుంబం కళ్ళముందే హుసేన్ సాగర్ లో దూకి చావడానికి ప్రయత్నించారు. ఇదే విషయాన్ని రాఖీ సినిమాకి కథను అందించిన ఒక రచయిత తన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.
Kiran Abbavaram ‘Ka’ : సోషల్ మీడియా ట్రోల్ బాగానే అర్థం చేసుకున్నాడు
ఇక ప్రస్తుతం శ్రియ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ట్విట్టర్లో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ తో సినిమా చేసిన ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు ఇద్దరు ప్రొడ్యూసర్లు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు అంటూ యాంటీ హీరోస్ ఫ్యాన్స్… ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. శ్రియ కూడా ఈ విషయాన్ని చాలా ఫన్నీ వేలో చెబుతూ ఇంటర్వ్యూలో నవ్వుకున్నారు.