IND vs NZ: టీమిండియా ( Team India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand) మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మూడవ టెస్ట్ కంటే ముందు న్యూజిలాండ్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా పై టెస్ట్ సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న న్యూజిలాండ్ కు.. బిగ్ షాక్ ఇచ్చింది ఆ దేశ క్రికెట్ బోర్డు.
Also Read: IND VS NZ: 3వ టెస్ట్ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్ ?
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ కు కూడా కేన్ మామ ( Kane Williamson )… దూరంగా ఉంటాడని అధికారికంగా ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే రెండు టెస్టులకు దూరమైన కేన్ మామ… మూడో టెస్టుకు కూడా దూరంగా ఉంటాడని తెలిపింది. ఈ మేరకు మంగళవారం రోజున అధికారిక ప్రకటన చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. అయితే… మూడవ టెస్టుకు దూరమైన కేన్ మామ… ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కు ఆడతాడని పేర్కొంది న్యూజిలాండ్ ( New Zealand) క్రికెట్ బోర్డు.
Also Read: VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !
నవంబర్ 28 తేదీ నుంచి… న్యూజిలాండ్ దేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ ఉంది. అయితే ఈ సిరీస్ సమయానికి కెన్ విలియమ్సన్ ( Kane Williamson )ఫిట్ గా ఉంటారని పేర్కొంది. అందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్. వాసవంగా శ్రీలంకలో జరిగిన సిరీస్ నేపథ్యంలో కేన్ మామకు ( Kane Williamson ) గాయమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కేన్ మామ. అయినప్పటికీ టీమిండియాతో టెస్టులకు… కేన్ మామాను సెలెక్ట్ చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. కానీ గాయం కారణంగా మూడు టెస్టులకు దూరమయ్యాడు కేన్ మామ.