NBK 109 Movie Title : బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ విషయానికి వస్తే అన్ స్టాపబుల్ షో తర్వాత బాలకృష్ణ (Balakrishna) ను ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు బాలకృష్ణ నుంచి ఒక సినిమా వస్తుంది అన్న కూడా సరేనా బజ్ కూడా ఆ సినిమాకి ఉండేది కాదు. అలా బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయిపోయాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణలోని నటన సామర్థ్యాన్ని వాడుకోవడం కేవలం బోయపాటి శ్రీను (Boyapati Srinu) కి మాత్రమే తెలుసు అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. బాలకృష్ణకు ఏ దర్శకుడు ఇవ్వని హిట్టును బోయపాటి శ్రీను ఇచ్చాడు అని చెప్పాలి.
Kiran Abbavaram ‘Ka’ : సోషల్ మీడియా ట్రోల్ బాగానే అర్థం చేసుకున్నాడు
అఖండ (Akhanda) సినిమా తర్వాత వచ్చిన బాలకృష్ణ ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వీర సింహారెడ్డి (Veera Simaha Reddy) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి చేసిన భగవంత్ కేసరి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇక ప్రస్తుతం 109వ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణలోని మాస్ కమర్షియల్ యాంగిల్ ని మరోసారి పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయనున్నాడు బాబి అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించి సర్కార్ సీతారాం అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. దీనిని అక్టోబర్ 30న అధికారికంగా ప్రకటించబోతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం.
ANR National Awards 2024 : ఏఎన్ఆర్ ఈవెంట్ కు చిరు తల్లి వెళ్ళడం వెనుక ఇంత కథ ఉందా?
ఇక వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమా తర్వాత బాబీ చేస్తున్న సినిమా ఇది. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లోని మాస్ కమర్షియల్ యాంగిల్ ను బయటకు తీసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి బాలయ్య బాబుకు ఏ రేంజ్ హిట్ ఇస్తాడు అని అందరూ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మొదట డాకు మహారాజా అనే టైటిల్ అనుకున్నారు. కానీ చిత్ర యూనిట్ అంతా ఆ టైటిల్ ని ఇప్పుడు పక్కన పెట్టి సర్కార్ సీతారాం వైపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత వంశీ. అయితే దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ (Game Changer) , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. వీటితోపాటు నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా కూడా అప్పుడే వస్తుంది అని సమాచారం వినిపిస్తుంది. అయితే బాలకృష్ణ సినిమాను వాయిదా వేయమని దిల్ రాజు నాగ వంశీతో సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు.