BigTV English

Heroine Shriya about Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ అద్భుతాలు సృష్టిస్తారు.. శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

Heroine Shriya about Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ అద్భుతాలు సృష్టిస్తారు.. శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

Heroine Shriya about Pawan Kalyan(Today tollywood news): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ శ్రియా శరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆమె పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు.


భవిష్యత్తులో పవన్ కల్యాణ్ అద్భుతాలు సృష్టిస్తారన్నారు. పవన్ ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ తాపత్రయపడతారన్నారు. ఆయన విషయంలో నేనెంతో గర్వపడుతున్నానన్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి బాలు సినిమా చేశామన్నారు. ఆయన ఎప్పుడూ సైలెంట్ గా ఉంటారని, శ్రమించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటూ పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తింది.

బాలు సినిమా షూటింగ్ సమయంలో ఓ సాంగ్ చేస్తుండగా ఆయన కాలికి గాయమైందని, అయితే పాట పూర్తయ్యే వరకు ఆ విషయం ఎవరితోనూ చెప్పకుండా చేశారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆయనను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్, చిరంజీవి వంటి హీరోలతో మరోసారి కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.


ఇదిలా ఉండగా, హీరోయిన్ శ్రియా..ప్రస్తుతం ‘షో టైమ్’ ప్రొగ్రామ్ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయని, తెలుగులో తేజ సజ్జా మూవీ కోసం నటిస్తున్నానన్నారు. అయితే ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. టాలీవు్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఏ సినీ పరిశ్రమ ఇష్టమని అడగగా.. ఇండియన్ సినిమా అని చెప్పడం ఇష్టమని చెప్పారు.

Also Read: ఆ సినిమా కోసమే రెండు నెలల్లో 18 కేజీలు తగ్గినా..రామ్ పోతినేని

పవన్ కల్యాణ్‌పై హీరోయిన్ శ్రియా శరన్ వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో శ్రియా ప్రముఖ హీరోలతో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో నటించింది.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×