BigTV English

Sreeleela: ఈ బ్యూటీ ఇక అవుటే?

Sreeleela: ఈ బ్యూటీ ఇక అవుటే?

Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల 2023 చివరి నుండి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆశించిన విజయాలు అందుకోలేకపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించినా, సక్సెస్ ట్రాక్‌ నిలబెట్టుకోవడంలో శ్రీలీల ఫెయిల్  అవుతోంది..ధమాకా సినిమాతో రవితేజ పక్కన, రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ కామెడీ, డాన్స్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటిది శ్రీలీల ధమాకా సినిమాతో రచ్చ లేపింది. దీంతో ఇక ఈ అమ్మాయికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్ సెట్ అయిపోయిందని అంతా అనుకున్నారు.


తన కెరీర్ ప్రారంభంలోనే వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడంతో శ్రీలీలకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఇటీవల ఆమె చేసిన చిత్రాలు నిరాశపరిచాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా ఫెయిల్ అయ్యాయి. గుంటూరు కారం హిట్ అయినా, ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 2025లో విడుదల కానున్న రోబిన్ హుడ్ చిత్రం గురించి ఇప్పటి వరకు ఆవరేజ్ టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించినా, ఆమె కెరీర్ కష్టాల్లో పడటానికి ప్రధాన కారణం పాత్రల ఎంపిక. ఎక్కువగా డాన్స్ బేస్డ్ రోల్స్ చేయడం, గ్లామర్ షోకే పరిమితమవడం ఆమెకి మైనస్ అయ్యింది. హీరోయిన్‌గా కొనసాగాలంటే, కేవలం పాటల కోసమే తీసుకునే హీరోయిన్ అనే ఇమేజ్‌ను మార్చుకోవాల్సి ఉంది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీలని చూసిన ఆడియన్స్, ఈ అమ్మాయిలో ఇంత పెర్ఫార్మర్ ఉందా అని షాక్ అయ్యారు. ఇప్పుడు శ్రీలీలకి అలాంటి పాత్రలే కావాలి, శ్రీలీల అలాంటి సినిమాలనే ఎంచుకోవాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలు చేయడంలో తప్పు లేదు కానీ అవి హిట్ అవుతాయా లేదా అనే లెక్కని శ్రీలీల ప్రతిసారి తప్పుతూనే ఉంది.


అల్లు అర్జున్ పుష్ప 2  చిత్రంలో “దెబ్బలు పడతాయి రాజా” అనే స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల డాన్స్ చేసి పాన్ ఇండియా ఆడియన్స్ ని మాస్ స్టెప్స్ తో ఆదరగోట్టింది. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పుష్ప 2 సినిమాకి ఉపయోగ పడింది కానీ శ్రీలీలకి కెరీర్ పరంగా పెద్దగా ఉపయోగ పడలేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రధాన చిత్రాలు పరాశక్తి (శివ కార్తికేయన్ హీరోగా) మరియు ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్ సరసన). ఈ సినిమాలు హిట్ అయితే ఆమె కెరీర్ మళ్లీ గాడిన పడొచ్చు. లేకపోతే మరో కృతిశెట్టి పరిస్థితి ఎదురవ్వొచ్చు.

శ్రీలీల టాప్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే, కేవలం కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు ఎంచుకోవాలి. డిఫరెంట్ జానర్స్ ట్రై చేయకుండా, వరుసగా ఒకే రకమైన పాత్రలు చేస్తే, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ నిర్ణయమే ఆమె భవిష్యత్తును నిర్ణయించబోతోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×