BigTV English

Trisha: ఆ ఏజ్ లో కూడా మైంటైనెన్స్ ఎలా రా బాబు… మ్యాగ్నేట్ లా లాగేస్తోంది

Trisha: ఆ ఏజ్ లో కూడా మైంటైనెన్స్ ఎలా రా బాబు… మ్యాగ్నేట్ లా లాగేస్తోంది

Trisha: త్రిష… సౌత్ సినీ ఇండస్ట్రీలో రెండున్నర ఏళ్లుగా కెరీర్ పీక్ స్టేజ్ మైంటైన్ చేస్తున్న ఏకైక స్టార్ హీరోయిన్. ఎప్పటి నుంచో కెరీర్ కొనసాగిస్తూనే, ఇప్పటికీ స్టార్ హీరోల సరసన సోలో హీరోయిన్‌గా నటిస్తూనే ఉండటం నిజంగా అరుదైన విషయం. ఇప్పుడు ఆమె గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడానికి మరో కొత్త కారణం వచ్చేసింది.


తల అజిత్‌తో కలిసి త్రిష నటిస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమా మేకింగ్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ప్రత్యేకంగా, ఆమె సారీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టిల్స్ బయటకు రాగానే, ఫ్యాన్స్ #Trisha అనే ట్యాగ్ క్రియేట్ చేసి, ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. త్రిష అందం, ఎలిగెన్స్, కెరీర్ లాంగ్ లాస్టింగ్ అనేది మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

త్రిష హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూనే ఉంది. ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా “మౌనం పేసియదే” (తెలుగులో “ఆడంతే అదో టైపు”) 2002 డిసెంబర్ 13న విడుదలైంది. అయితే, అసలు సినిమాల్లో ఆమె అడుగు పెట్టింది 1999లో “జోడి” అనే చిత్రంతో. అంటే హీరోయిన్‌గా నిలబడేలోపు ఆమె మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అనుభవాన్ని సంపాదించుకుంది.


తమిళ్ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన త్రిష, “వర్షం”తో తన స్టార్‌డమ్‌ను ప్రూవ్ చేసింది. ఆ తర్వాత “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”, “అతడు”, “ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే” వంటి హిట్ చిత్రాలతో తెలుగులోనూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ, హిందీలో కూడా త్రిష తన సత్తా చాటింది.

త్రిష గురించి చెప్పేటప్పుడు “పొన్నియిన్ సెల్వన్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఈ చిత్రంలో ఆమె ఏ స్థాయిలో అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాయ్ లాంటి లెజెండరీ బ్యూటీ ఉన్నా, త్రిష తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో డామినేట్ చేయగలిగింది. ప్రేక్షకులు ముచ్చటపడేలా తన రాయల్ లుక్‌ను మైంటైన్ చేసింది. అప్పుడే చాలా మంది “త్రిష అందం ఏదో డీఏజింగ్ టెక్నాలజీ లా ఉంది, ఆమె ఏజ్ పెరుగుతుందా?” అని ఆశ్చర్యపోయారు.

ఒక దశలో యువ హీరోయిన్స్ ఎంట్రీతో త్రిష కెరీర్ స్లో అయిందనే మాటలు వినిపించాయి. కానీ, ఆమె “పొన్నియిన్ సెల్వన్”, “లియో” సినిమాలతో తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటిస్తూ, క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ తన స్టార్డమ్‌ను కంటిన్యూ చేస్తోంది. అజిత్‌తో “విడ ముయార్చి”, చిరంజీవితో “విశ్వంభర” సినిమాలు చేయడం ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది.

23 ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ, స్టార్ హీరోల సరసన సోలో హీరోయిన్‌గా కొనసాగడం త్రిషకే సాధ్యమైంది. సినిమాల్లో వరుసగా కొత్త ఫేసులు వస్తుంటాయి, టాప్ హీరోయిన్‌ల లిస్ట్ మారిపోతూ ఉంటుంది. కానీ, త్రిష మాత్రం అదే ఎనర్జీ, అదే గ్రేస్‌తో తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే, ఇంకా చాలా ఏళ్లు సౌత్ ఇండస్ట్రీలో త్రిష హవా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×