BigTV English

Cyber Fruad: సిబిఐ అధికారులగా పోజులిచ్చి రూ.4.4 కోట్లు దోపిడి.. మోసపోయిన డాక్టర్!

Cyber Fruad: సిబిఐ అధికారులగా పోజులిచ్చి రూ.4.4 కోట్లు దోపిడి.. మోసపోయిన డాక్టర్!

Cyber Fruad| టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత చదువుకున్న దొంగలు కూడా పెరిగిపోతున్నారు. ఇంతకుముందులా కష్టపడి చాటుగా ఇళ్లలో ప్రవేశించి దొంగతనం చేయాల్సిన అవసరం లేకుండా.. కేవలం రెండు మూడు ఫోన్ కాల్స్.. కొంత ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి అవగాహన ఉంటే చాలు సులువుగా పెద్ద మొత్తంలో దోచేస్తున్నారు. ఇలాంటిదే ఒక ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రంలోని గయా నగరానికి చెందిన ఒక పేరుగాంచిన డాక్టర్ కు పది రోజుల క్రితం ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఒక సిబిఐ అధికారినని పరిచయం చేసుకున్నాడు. డాక్టర్ గారి పేరు మీద గయా నగరంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఒక అకౌంట్ ఉందని దాని ద్వారా మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయని తెలిపారు. అయితే ఆ డాక్టర్ తనకేమీ తెలియదని వివరణ ఇవ్వగా.. అయితే వెంటనే ఆ బ్యాంక్ అకౌంట్ లోని బ్యాలెన్స్ మొత్తం వేరే అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పాడు.

Also Read:  జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!


అలా డాక్టర్ ఆ అకౌంట్ లోని రూ.1.4 కోట్లు వేరే అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ ఇది జరిగిన రెండు రోజుల తరువాత మళ్లీ ఫోన్ చేసి మనీలాండరింగ్ కేసు లో డాక్టర్ పేరిట అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నామని తెలిపాడు. దీంతో సదరు డాక్టర్ కంగారు పడిపోయాడు. తానెప్పుడు కావాలన్నా విచారణకు ఢిల్లీ వస్తానని.. కానీ అరెస్ట్ చేయొద్దని వేడుకున్నాడు. దానికి ఆ సిబిఐ అధికారి.. అయితే సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.3 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని.. కేసు పరిష్కారం అయ్యాక ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తామని కండీషన్ పెట్టాడు. దాంతో ఆ డాక్టర్ 24 గంటల్లోగా సిబిఐ అధికారి చెప్పిన అకౌంట్ లో రూ.3 కోట్లు జమ చేశాడు.

ఆ తరువాత సిబిఐ అధికారికి ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అలాగే ఉండగా… డాక్టర్ కు తాను మోసపోయానని అనుమానం కలిగింది. తన మిత్రులతో సమస్య గురించి చెప్పగా.. వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో డాక్టర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి తాను ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంట్ వివరాలన్నీ తెలిపాడు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

సైబర్ పోలీసులు వెంటనే ఆ అకౌంట్లను ట్రాక్ చేయగా.. డాక్టర్ ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులన్నీ 123 అకౌంట్లకు మళ్లించారని తెలిసింది. అయితే వాటిలో కొన్ని అకౌంట్లను సైబర్ పోలీసులు బ్లాక్ చేయించి.. రూ.61 లక్షలు మాత్రమే రికవర్ చేయగలిగారు. మిగతా మొత్తం సైబర్ దొంగలు విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఆ అకౌంట్లు విత్ డ్రా చేసుకున్న వారి వివరాలనుబట్టి విచారణ చేస్తున్నామని గయా నగర సైబర్ పోలీసులు తెలిపారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×