BigTV English

Mohammed Shami: షమీపై భారత సెలక్టర్ల ఫోకస్.. తిరిగి జట్టులోకి?

Mohammed Shami: షమీపై భారత సెలక్టర్ల ఫోకస్.. తిరిగి జట్టులోకి?

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయంతో క్రికెట్ కి దూరమయ్యాడు షమీ. ఆ తర్వాత సంవత్సర కాలానికి పైగా జట్టుకి దూరమయ్యాడు. అనంతరం 2024 లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున అన్ని మ్యాచ్ లు ఆడాడు. అయితే ఆ సమయంలోనే షమీ మోకాలికి మరోసారి గాయం అయినట్లు సమాచారం.


Also Read: SA 20 league 2025: నేటినుంచే SA-20 లీగ్.. బరిలో SRH.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. గాయం కారణంగా పలుమార్లు మోకాలు వాపు పెరుగుతుండడంతో షమీ లండన్ కి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంవత్సర కాలం తర్వాత మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్ కీ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.


ఆ తర్వాత మధ్యప్రదేశ్ తో జరిగిన రంజీ మ్యాచ్ లో కూడా బెంగాల్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు షమీ. ఈ మ్యాచ్ లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత చండీగఢ్ తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోనూ రాణించి.. బెంగాల్ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఇక షమీ ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతడిని జట్టులోకి తీసుకోలేదు. అయితే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ – షమీ మధ్య కొంతకాలంగా సంబంధాలు సరిగ్గా లేవంటూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైన సమయంలో ప్రచారం జరిగింది.

షమీ ఫిట్నెస్ పై రోహిత్ శర్మ పలుమార్లు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని పలు కథనాలు పేర్కొన్నాయి. తాను పూర్తి ఫీట్ గా ఉన్నానని షమీ చెబుతుంటే.. పూర్తి ఫిట్ గా లేని ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకొని రిస్క్ తీసుకోవాలని భావించడం లేదని అన్నాడు రోహిత్. కానీ షమీ కోసం ఎప్పుడూ టీమ్ ఇండియా తలుపులు తెరిచే ఉంటాయని అన్నాడు.

Also Read: Konstas on Virat Kohli: విరాట్ కోహ్లీ నా దేవుడు.. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్ సంచలనం

షమీ విరామం తీసుకొని చాలాకాలం గడిచిన కారణంగా అతడి విషయంలో 100 శాతానికి మించి ఆశిస్తున్నామని.. అతడు జట్టులోకి వచ్చి ఆడాలని మేము ఒత్తిడి చేయాలనుకోవడం లేదని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంలో అన్నాడు రోహిత్. అయితే ఇప్పుడు షమీ తిరిగి జట్టులోకి చేరనున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లు షమీపై కన్నేశారని సమాచారం. ఇంగ్లాండ్ సిరీస్ కి బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో షమీని టీమ్ లోకి తీసుకురావాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారట.

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

Big Stories

×