BigTV English

HI NANNA : ఎమోషన్ తో గుండెల్ని పిండేస్తూ.. మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్న హాయ్ నాన్న ట్రైలర్

HI NANNA : ఎమోషన్ తో గుండెల్ని పిండేస్తూ.. మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్న హాయ్ నాన్న ట్రైలర్

HI NANNA : నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్‌ కాంబోలో తెరకెక్కిన రొమాంటిక్ ఎమోషనల్ మూవీ హాయ్ నాన్న. ఈ ఫీల్ గుడ్ డ్రామా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీ పై ఆసక్తి రేపే విధంగా ఉంది. గుండెలను బరువు ఎక్కించే ఎమోషన్ తో.. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ తో.. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా కట్ చేశారు మేకర్స్.


కూతురికి ఎప్పుడూ కథలు చెబుతూ ఉండే నాన్నను.. మరి అమ్మకథ చెప్పవా అని అడుగుతుంది. అనగనగా ఒక రాజు అని నాని అనడంతో స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్ .. నా ప్రేమ నీకు సరిపోదా మహీ..అనే ఒక ఎమోషనల్ డైలాగ్ తో ముగుస్తుంది. మొత్తం 2 నిమిషాల 41 సెకండ్ల నిడివితో సాగే ఈ ట్రైలర్.. చూసేవారి హార్ట్ ను టచ్ చేసేలా.. చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ మూవీలో తండ్రి కి కూతురు పై ఉన్న ప్రేమ.. తల్లి గురించి తెలుసుకోవాలి అని కూతురు పడే తపన అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు మూవీ పై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

పాటలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన హేషమ్.. ఈ ట్రైలర్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బీజీఎం అందించాడు. ఈ ట్రైలర్ లో నాని తన కూతురితో హ్యాపీగా లైఫ్ గడుపుతూ ఉండగా మృణాల్ వాళ్ళ జీవితంలోకి ఎలా ఎంటర్ అయిందో చూపిస్తారు. నాని కూతుర్ని ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడడంతో ఆమె వారిద్దరికీ దగ్గరవుతుంది. ఎప్పుడు కూతురు తల్లి గురించి అడిగినా నాని దాటేస్తూ ఉంటాడు.. కానీ ఒకరోజు చెప్పాల్సి వస్తుంది. అమ్మ బదులు ఎవరిని ఊహించుకోను అని మహి అడిగినప్పుడు అక్కడే ఉన్న మృణాల్.. అదేనండి మూవీ లో యష్న.. నన్ను ఊహించుకో అని సజెస్ట్ చేస్తుంది.


మూవీలో నాని వైఫ్ క్యారెక్టర్ లో శృతిహాసన్ నటించిందన్న విషయం ట్రైలర్ లో కనిపించే చిన్న ఒక్క బిట్ ద్వారా అర్థమవుతుంది. నాని తన లవ్ స్టోరీ ,పెళ్లి ,గొడవలు అన్ని వివరిస్తుండగా కాస్త ఎమోషనల్ అయ్యి.. నా ప్రేమ సరిపోదా మహీ అని కూతురితో అంటాడు. తండ్రి బాధ అర్థం చేసుకున్న కియారా అతడిని గట్టిగా హత్తుకొని.. ఇక చెప్పద్దు నానా ఇంటికి వెళ్లి పోదాం అంటుంది. ట్రైలర్ ఎండింగ్ లో వచ్చే ఈ సీన్.. చూసే ప్రతి ఒక్కరి గుండెల్ని బరువెక్కించేలా.. మాంచి ఎమోషనల్ టచ్ తో ఉంది. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్ ఇప్పటికే 2 మిలియన్లపైగా వ్యూస్ సాధించి.. యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది. డిసెంబర్ 7న హాయ్ నాన్న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

https://youtu.be/tdKdozGeIeE?feature=shared

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×