BigTV English

IAS AK Goel : ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటివద్ద హైడ్రామా.. సెర్చ్ వారెంట్ ను అడ్డుకున్నదెవరు ?

IAS AK Goel : ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటివద్ద హైడ్రామా.. సెర్చ్ వారెంట్ ను అడ్డుకున్నదెవరు ?
IAS AK Goel latest news

IAS AK Goel latest news(Hyderabad news today):


హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి AK గోయల్ ఇంట్లో సోదాల వ్యవహారంలో సందేహాలు బలపడుతున్నాయి. ఈసీ ఫ్లైయింగ్‌ స్క్వాడ్, ఐటీ అధికారులకు సెర్చ్‌ వారెంట్లు రాకుండా అడ్డుకున్నదెవరన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. గోయెల్ ఇంట్లోకి ఎవరూ అడుగుపెట్టకుండా మేనేజ్ చేసేందెవరని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసినా ఎందుకు సోదాలు చేయలేకపోయారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఇంట్లో ఏమీ లేకపోతే అధికారులకు చూపించడానికి గోయెల్‌ ఎందుకు భయపడ్డారని కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

సెర్చ్ వారెంట్‌ కోసం రాత్రి 11.30 గంటల వరకు ఈసీ ఫ్లైయింగ్‌ స్క్వాడ్ ఎదురుచూసింది. అయితే ఎంతకీ సెర్చ్‌ వారెంట్‌ రాకపోయే సరికి ఫ్లైయింగ్‌ స్క్వాడ్ అర్ధరాత్రి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈసీ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ను గోయెల్ ఇంటి లోపలికి అనుమతించలేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేసిన ఈసీ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ ఇంటి గేటు లోపలకు కూడా వెళ్లలేకపోయారని విమర్శలు వస్తున్నాయి.


రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటిలో వందలకోట్ల డబ్బు ఉందని, బీఆర్ఎస్ అభ్యర్థులకు చేరవేసేందుకు ఆ డబ్బును అక్కడ ఉంచారని తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం మధ్యాహ్నం ఈసీకి ఫిర్యాదు చేయగా.. సాయంత్రానికి ఈసీ ఫ్లైయింగ్ స్క్వాడ్ గోయల్ ఇంటికి చేరుకుంది. కానీ.. సెర్చ్ వారెంట్ లేకుండా వెళ్లడంతో.. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆయన ఇంటి గేటు దాటి లోపలికి వెళ్లలేకపోయింది. దాంతో సెర్చ్ వారెంట్ కోసం రాత్రి 11.30 గంటల వరకూ రోడ్డుపైనే ఎదురుచూసినా.. ఫలితం లేదు. చేసేది లేక ఐటీ అధికారులు వెనుదిరిగారు. కానీ.. తన ఇంటిలో ఏమీ లేకపోతే అధికారులకు చూపించేందుకు గోయల్ ఎందుకు భయపడుతున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

.

.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×