BigTV English

HI NANNA New Poster : సీతా ఇది నువ్వేనా..? హాయ్ నాన్న కొత్త పోస్టర్ వైరల్..

HI NANNA New Poster :  సీతా ఇది నువ్వేనా..? హాయ్ నాన్న కొత్త పోస్టర్ వైరల్..
HI NANNA New Poster

HI NANNA New Poster : నాచురల్ స్టార్ నాని.. వైవిద్యమైన కథలు ఎంచుకోవడమే కాకుండా తన నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకునే నటుడు. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయి.. తనదైన శైలిలో దూసుకుపోతాడు నాని. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ఎమోషనల్ ఓరియెంటెడ్ మూవీ హాయ్ నాన్న. తండ్రి కూతుర్ల అనుబంధం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.


ఇప్పటికే మనకు ఇలా పదేళ్ల పాప, ఆమె తండ్రి, మధ్యలో ఒక హీరోయిన్ .. ఇలాంటి బేస్ తో వచ్చిన కథలు ఎన్నో ఉన్నాయి. అయితే హాయ్ నాన్న స్టోరీ వీటికంటే కాస్త భిన్నంగా ఉంటుంది అని టాక్. ఒకపక్క పదేళ్ల పాపకు తండ్రిగా కనిపిస్తూ మరో పక్క రొమాంటిక్ లవ్ సీన్స్ తో నాని ఈ సినిమాను బాగా బ్యాలెన్స్ చేశాడు అన్న విషయం పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ మరియు పాటలు ఇప్పటికే చిత్రం పై అంచనాలను భారీగా పెంచాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన మరొక పోస్టర్ మూవీలో రొమాంటిక్ యాంగిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పకనే చెప్తుంది. ఇప్పటివరకు మాక్సిమం చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ను హైలైట్ చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు విడుదలైన పోస్టర్ లో మాత్రం నాని,మృణాల్‌ ఠాకూర్‌ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కూడా బాగానే ఉంది అంటూ నెటిజన్స్ దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు.


ఈ పోస్టర్ లో మృణాల్‌ ను బాగా గమనిస్తే సీతారామం మూవీలో సీత జలక్ కచ్చితంగా కనిపిస్తుంది. సైకిల్ నడిపించుకుంటూ ఎంతో స్టైల్ గా ముందుకు వెళ్తున్న సీత వెనుక కెమెరా పట్టుకొని నాని ఆమె అందానికి మైమర్చిపోయి నవ్వుతూ అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ సీత వెనుక పడ్డ నాన్న నాని అంటూ హడావిడి చేస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 21 న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×