Psycho Killer Toss For Murdering Teenager | అతడు ఒక సైకో. ఉన్మాదంతో యువతులను చంపడమే అతని పని. ఒంటగా ఉన్న యువతులు, అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో స్నేహం చేస్తాడు. ఆ తరువాత మాయమాటలు చెప్పి తన స్థావరానికి తీసుకెళ్లి టాస్ వేస్తాడు. బొమ్మా బొరుస ఆటతో ఆమె ప్రాణాలు తీస్తాడు. హెడ్స్ పడితే నేరుగా చంపేయడం ఆ తరువాత శవంపై అత్యాచారం చేయడం. టెయిల్స్ పడితే అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేయడం. ఈ పైశాచిక క్రీడతో అతను ఆనందం పొందుతాడు. అయితే తాజాగా ఈ ఉన్మాదికి కోర్టు జీవితకాలం కారాగార శిక్ష విధించింది. మరణ శిక్ష విధించాల్సిన కృూరుడికి జీవితకాలం జైలు శిక్ష వేయడం వెనుక కూడా ఒక కారణముంది. ఈ ఘటన పోలాండ్ దేశంలో జరిగింది.
పోలాండ్‌లో కలకలం సృష్టించిన యువతి హత్య, అత్యాచార కేసులో విచారణ పూర్తి చేసిన కోర్టు నేరస్తుడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో వివరాలు తెలిస్తే రోమాలు నిక్కపొడవాల్సిందే. ఎందుకంటే నిందితుడు ఆమెను చంపే ముందు కాయిన్ టాస్ వేశాడు! టెయిల్స్ పడి ఉంటే యువతి బతికి ఉండేదని, కానీ హెడ్స్ పడటంతో ఆమెను చంపేశానని కోర్టులో స్వయంగా అంగీకరించాడు. యువతిని హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని ఒక మృగంలా రేప్ చేశాడు అని తేలింది.
Also Read: రన్నింగ్ ట్రైన్‌లో వీడియోలు తీసి.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..
2023 ఆగస్టులో జరిగిన ఈ సంఘటన కటోవైస్ అనే నగరంలో జరిగింది. 18 ఏళ్ల విక్టోరియా అనే యువతి.. ఆ రోజు రాత్రి పార్టీ నుంచి ఇంటికి వెళుతుండగా.. బస్సులో హెపా అనే 20 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. కారు రిపేర్ షాప్‌లో పనిచేస్తున్న హెపా, డ్యూటీ ముగించుకుని బస్సులో వెళుతుండగా విక్టోరియా కనిపించింది. ఇద్దరూ స్నేహపూర్వకంగా పలకరించుకున్నారు. ఆ తరువాత విక్టోరియాను హెపా తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నిద్రలోకి జారుకుంది. అయితే ఆమెను ఎలా చంపుదామని హెపా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక ప్రముఖ ఇంగ్లీషు నవలలో ఒక సైకో పాచికలు వేసి ఆ సంఖ్య ఆధారంగా యువతులను హింసించి చంపేవాడు. ఆ నవల చదివిన హెపా కూడా అలాగే చేయాలని అనుకున్నాడు.
అందుకే కాయిన్ టాస్ వేశాడు. హెడ్స్ పడితే ఆమెను చంపేదామనుకుని, టెయిల్స్ పడితే రేప్ చేద్దామనుకున్నాడు. అయితే కాయిన్ టాస్ వేస్తే హెడ్స్ పడింది. అంతే .. కొంతసేపటి తర్వాత, హెపా విక్టోరియాను దారుణంగా కొట్టి, గొంతుకు తాడు కట్టి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు. అనంతరం తన కామ వాంఛను అదుపు చేసుకోలేక ఆమె మృతదేహాన్ని రేప్ చేశాడు. తర్వాత, ప్లాస్టిక్ కవర్‌లో శవాన్ని చుట్టేశాడు. ఆ తరువాతే ఎవరూ ఊహించనది చేశాడు. అతను పోలీసులకు ఫోన్ చేశాడు.
తాను ఒక మృగంలా మారిపోతున్నానని.. ఇంతకుముందు కూడా కొందరిని ఇలాగే చంపేశానని తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విక్టోరియా శవాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. ఆ తరువాత కోర్టు విచారణలో నిందితుడి షాకింగ్ ప్రకటనలు చేశాడు.
గత వారం జరిగిన విచారణలో నిందితుడు పలు కీలక విషయాలను వెల్లడించాడు. తనకు ఎవరినైనా చంపాలని కోరికలు ఉండేవని, విక్టోరియా కనిపించినప్పుడు ఆమెను తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి, నిద్రలోకి జారుకున్న ఆమెను చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాయిన్ టాస్‌లో హెడ్స్ పడటంతో ఆమెను చంపేశానని, ఆపై ఆమె మృతదేహంతో శృంగారంలో పాల్గొన్నట్లు వివరించాడు. ఈ వ్యాఖ్యలన్నీ చేసే సమయంలో విక్టోరియా తల్లిదండ్రులు కోర్టులోనే ఉన్నారు. ఇదంతా విని వారు అతనికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి బంధువులు, స్నేహితులు “నీకు బతికే అర్హత లేదు” అని కోర్టు రూమ్‌లో గట్టిగా అరిచారు.
ఈ వివరాలు విని కోర్టులో ఉన్న వారందరూ షాక్‌కు గురయ్యారు. ఫిబ్రవరి 12 నుంచి ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అయితే విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి.. నిందితుడు దోషి అని తేలుస్తూ.. అతనికి తాజాగా జీవిత ఖైదు శిక్ష విధించారు. హెపా తనంట తాను పోలీసులకు లొంగిపోవడంతో అతనికి మరణ శిక్షకు అర్హుడు కాదని.. అతను ఒక మానసిక రోగి అని కోర్టు వ్యాఖ్యానించింది. కానీ సర్వత్రా అతనికి కఠిన శిక్ష పడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.