Second Marriage Without Divorce| ఓ మహిళకువివాహమై 13 సంవత్సరాలు గడిచాయి. ఆమెకు 9 సంవత్సరాల వయస్సు గల కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ జీవితం సుఖంగానే సాగుతోంది. కానీ సోషల్ మీడియా అనే పెనుభూతం వారి జీవితంలో కల్లోలం సృష్టించింది.ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఇంటి నుంచి పారిపోయింది. ఆమె కోసం భర్త ఆందోళన చెందుతుండగా.. వారం రోజుల క్రితం ఆమె తన సోషల్ మీడియా ప్రేమికుడిని వివాహం చేసుకుంది. అంతే కాదు.. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది.అచ్చం సినిమా కథను తలపించే ఈ ఘటన బెంగళూరు సమీపంలోని నెలమంగళ తాలూకా జక్కసంద్ర గ్రామం రాఘవేంద్రనగర్‌లో జరిగింది.
వివారాల్లోకి వెళితే.. నేత్రావతికి 13 సంవత్సరాల క్రితం రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. నెల క్రితం నేత్రావతికి తన భర్తతో గొడవ జరిగింది. దీంతో వెంటనే ఆ రాత్రి ఆమె ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా.. వెళ్లిపోయింది. తన వెంట తన కుమారుడిని కూడా తీసుకెళ్లింది. ఇటీవల ఆమె సంతోష్ అనే యువకుడిని గుడిలో వివాహం చేసుకుంది. పెళ్లి వీడియోను రికార్డ్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన మొదటి భర్..త నెలమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేసుకుని మోసం చేసిందని, న్యాయం చేయాలని పోలీసులను కోరాడు.
అనాథ అని చేరదీస్తే మోసం చేసింది
రమేష్, అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కోడలు తమను మోసం చేసిందని.. రెండు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ప్రియుడితో చాటింగ్ చేస్తోందని.. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. తమ మనవడిని కూడా తీసుకెళ్లిందని, ఆ చిన్న పిల్లవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదని విచారం వ్యక్తం చేశారు. ఆమెకు ఎంతగా నచ్చజెప్పినా వినకుండా పోయిందని చెప్పారు. నేత్రావతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు, ఆమె అనాథ అని చేరదీసి వివాహం చేసుకున్నామని, కానీ ఇలా చేసిందని రమేష్ దుఃఖంతో చెప్పాడు. తన భార్య పేరు మీద రూ.50 లక్షల విలువైన భూమి ఉందని, రెండవ భర్త ఆ భూమిని కాజేయాలనే పెళ్లి చేసుకున్నాడని రమేష్ ఆరోపణలు చేశాడు.
Also Read: ‘ఎక్స్‌కూజ్ మీ’ అన్నందుకు మహిళలను చితకబాదిన జనం.. మాతృభాషలో మాట్లాడకపోతే అక్కడ అంతే
పోలీస్ స్టేషన్ లో నేత్రావతి
ఈ కేసులో ఇంకా ట్విస్టులు ఉన్నాయి. నేత్రావతి తన న్యాయవాది తో బుధవారం నెలమంగళ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. భర్త ఇంట్లో ఉన్న తన వస్తువులను తీసుకెళ్లడానికి పోలీసులు తనకు భద్రత కల్పించాలని కోరింది. మొదటి భర్త రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడని.. తనను కొట్టేవాడని ఆమె ఆరోపించింది. అతనితో కలిసి జీవించడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పింది. ఇటీవలే అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపింది.
ఉత్తర్ ప్రదేశ్ లో ఇంతకంటే
ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో 27 ఏళ్ల షబ్నం (ఇప్పుడు శివాని) అనే మహిళ తన కంటే 9 ఏళ్లు చిన్నవాడైన హిందూ యువకుడిని ప్రేమించింది. అతడిని వివాహం చేసుకోవడానికి తన మతాన్ని మార్చుకుంది. హిందు మతం స్వీకరించింది. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి భర్త రోడ్డు ప్రమాదంలో వికలాంగుడయ్యాక అతడికి విడాకులిచ్చింది. రెండవ భర్తతో కలిసి ఉంటూనే పొరుగున నివసించే శివాజీ అనే కుర్రాడితో ప్రేమలో పడింది.ఆ తరువాత తన భర్తతో గొడవపడి అతడికి విడాకులిచ్చింది. 17 ఏళ్ల శివాజీని ప్రేమించి హిందూ మతం స్వీకరించింది. కానీ శివాజీ కుటుంబం ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో షబ్నం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇప్పుడు తన పేరు “శివాని” అని చెప్పుకుంటూ.. ఎవరూ తమ ప్రేమకు అడ్డు రాకూడదంటూ మీడియా ముందు చెప్పింది.