BigTV English
Advertisement

Yash – Toxic movie: యష్ కోసం రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..!

Yash – Toxic movie: యష్ కోసం రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..!

Yash – Toxic movie: ఒకప్పుడు కన్నడలో సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరో యష్ (Yash).. ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎప్పుడైతే కేజిఎఫ్ (KGF ) సినిమా చేశారో.. ఇక ఈయన పాన్ ఇండియాగా పేరు సొంతం చేసుకున్నారు. కే జి ఎఫ్ , కే జి ఎఫ్ 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ ను దక్కించుకున్న హీరోగా రికార్డ్ సృష్టించారు. సాధారణంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావడానికి సెలబ్రిటీలు ఎన్నో కష్టాలు పడతారు. కానీ హీరో యష్ మాత్రం ఒక్క సినిమాతో కుంభస్థలాన్ని ఢీ కొట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే భారీ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండవ స్థానాన్ని దక్కించుకుంది.


మలయాళ నటి డైరెక్షన్ లో టాక్సిక్..

ఇక ఇప్పుడు టాక్సిక్ (Toxic) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యష్. మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu mohandas) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎప్పటిలాగే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.


ముంబై కి చేరుకున్న హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..

ఇకపోతే తాజాగా ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జే.జే. పెర్రీ టాక్సిక్ టీమ్ లో చేరి సినిమాపై అంచనాలను మరింత పెంచారు. ఇక ఇప్పుడు ఈయన ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఇందులో జే.జే. పెర్రీ జాయిన్ కాబోతున్నాడని తెలిసి ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలను ప్రదర్శించడానికి ఒక సెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందట. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని కలిగజేస్తాయని సమాచారం.

ముంబైలో ప్రారంభమైన షూటింగ్..

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం యష్ ముంబైలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో జాయిన్ అవ్వడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జే.జే.పెర్రి ఇప్పుడు ముంబైకి చేరుకున్నారు. జేజే పెర్రి విషయానికొస్తే జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి బ్లాక్ బాస్టర్ ఫ్రాంచైజీలలో పనిచేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు ఈ ఫ్రాంచైజీలతో తన పనితీరును ప్రతిభను చాటిన ఈయన ఇప్పుడు యష్ సినిమాలో నటిస్తున్నాడని తెలియడంతో ఇక్కడ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఉత్కంఠ భరితమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. హాలీవుడ్ చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు ఈ సినిమా తో తన నైపుణ్యాన్ని చూపించడానికి సిద్ధమైనట్లు సమాచారం. మరి టాక్సిక్ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×