Big Stories

Microphone on Pawar: నేతలకు ఇబ్బందులు.. జగన్, బాబు, ఇప్పుడు పవార్, కాకపోతే..?

Microphone on Pawar: రాజకీయ నేతలు ప్రజల ముందుకు రావడానికి భయపడే రోజులు  మొదలయ్యాయి . ఇది ఏ ఒక్క పార్టీకీ పరిమితం కాలేదు. నేతలు ప్రజల్లోకి వచ్చిన ప్రతీసారి ఇబ్బందులు తప్పడంలేదు. తాజాగా ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్‌పవార్ వంతైంది. సమావేశం ఆయన మాట్లాడుతుండగా మైక్రోఫోన్ ఒకటి ఆయనపైకి దూసుకురావడం కలకలం రేపింది. ఈ ఘటన పూణెలో జరిగింది.

- Advertisement -

మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఓ సమావేశం జరిగింది. దీనికి శరద్‌పవార్‌తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి పవార్ కూతురు సుప్రియసూలే బరిలో ఉన్నారు. ఆమెకి ప్రత్యర్థిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎస్సీపీ అధినేత అజిత్‌పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. అయితే సభ జరుగుతుండగా ఓ విలేకరి మెక్రోఫోన్‌ను శరద్‌పవార్ పైకి విసిరారు.

- Advertisement -

అది పవార్‌ను తాకక ముందే ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. శరద్‌పవార్ స్పీచ్‌ మరింత స్పష్టంగా రికార్డు చేయడం కోసం మైక్రోఫోన్‌ను ముందుకు విసిరానని ఆ విలేకరి చెప్పాడు. దానికి బదులుగా ముందున్న వ్యక్తులకు ఆ పరికరాన్ని అందజేసి వేదిక సమీపంలో ఉంచాలని అధికారులు అభిప్రాయపడ్డారు.

Also Read: పరీక్షలో ఫేలయ్యి.. ఫుల్లు ఫేమసయ్యాడు

ఇటీవల కాలంలో నేతలపై రాళ్లు, చెప్పులు, మైక్రోఫోన్లు విసిరిన ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర సందర్భంగా ఓ వ్యక్తి ఆయనపైకి రాయి విసిరాడు. జగన్ కన్ను పైభాగంలో తగిలింది. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలోనూ ఇలాంటి ఘటన జరిగింది. కాకపోతే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

అంతకుముందు బీహార్ సీఎం నితీష్‌కుమార్ సభలోనూ ఓ వ్యక్తి చెప్పు విసిరారు. అదికాస్త స్టేజికి ముందు పడింది. అంతేకాదు గతంలో కేంద్ర మాజీమంత్రి చిదంబరం మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఓ రిపోర్టర్ చెప్పు విసిరిన సంగతి తెల్సిందే.  ఆ తరహా ఘటనలను కంట్రోల్ చేయకుంటే రాబోయే రోజుల్లో నేతలకు మరిన్ని ఇబ్బందులు తప్పవన్నది రాజకీయ విశ్లేషకుల చెబుతున్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News