BigTV English
Advertisement

Laila Business : లైలా బిజినెస్.. ఎన్ని కోట్లు రాబడితే లాభాల్లోకి వస్తుంది ..?

Laila Business : లైలా బిజినెస్.. ఎన్ని కోట్లు రాబడితే లాభాల్లోకి వస్తుంది ..?

Laila Business : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ విభిన్న కథలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు.. గ తేడాది ఏకంగా మూడు సినిమాలతో వచ్చాడు. అందులో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా మూడో సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది.. ఈ ఏడాది మొదటగా లైలా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు విశ్వక్. ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా… ఇందులో, ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా, కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు.. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ బిజినెస్ వివరాలను ఒకసారి తెలుసుకుందాం..


లైలా మూవీ.. 

గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వక్ సేన్ ఈ మూవీలో లేడి గెటప్ లో కనిపించడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఫుల్ ఎంటర్‌టైనర్, యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన సినిమాకు ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. భారీ తారాగణం, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. దాంతో ఈ సినిమాకు భారీగా ఖర్చు జరిగింది. ఈ మూవీని సుమారుగా 35 కోట్ల రూపాయలతో పెట్టినట్లు తెలుస్తుంది. అయితే టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్, ట్రైలర్ లాంటి కంటెంట్, అలాగే వివాదాస్పద అంశాలు ఈ సినిమాకు సానుకూలంగా మారాయి. ఈ సినిమాపై ఓ రేంజ్ క్రేజ్, బజ్ ఏర్పడింది.. ఇక తాజాగా ఈ మూవీ బిజినెస్ వైరల్ గా మారింది.. ఎంత బిజినెస్ చేసిందో చూద్దాం..


ఎంత బిజినెస్ చేస్తే హిట్ అవుతుంది..? 

గత ఏడాది నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాఖీ మూవీలకు మంచి బిజినెస్ జరిగింది. సినిమాలు కూడా మంచి టాక్ ను అందుకున్నాయి. దాంతో ఈ లైలా మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాకు నా డిమాండ్ల ను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ స్క్రీన్ లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు ఉన్నారు మేకర్స్.. లైలా థియేట్రికల్ రైట్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంత బిజినెస్ జరిగిందంటే.. ఏపీ, నైజాం సెంటర్ల రైట్స్ సుమారుగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 కోట్ల షేర్, 14 కోట్ల గ్రాస్ దాదాపు రాబట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి 8 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి . ఫైనల్ గా లైలా 10 కోట్లకు పైగా రాబడితే లాభల్లోకి వచ్చినట్లే.. రేపు భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×