BigTV English

Unni Mukundan: ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు మేము కూడా చేయగలం.. మలయాళ నటుడి హాట్ కామెంట్స్

Unni Mukundan: ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు మేము కూడా చేయగలం.. మలయాళ నటుడి హాట్ కామెంట్స్

Unni Mukundan: మాలీవుడ్ అంటే ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే ఇండస్ట్రీ అని, అలాంటి సినిమాలను వారు తప్పా ఇంకెవరూ తెరకెక్కించలేరని ఫ్యాన్స్ అంటుంటారు. కానీ ఆ ట్యాగ్ వల్లే మలయాళ చిత్రాలు మరే ఇతర జోనర్‌ను ప్రేక్షకులకు అందించలేకపోతున్నాయి. ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీ నిపుణులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. తాజాగా ఒక హీరో కూడా ఈ విషయంపై మాట్లాడాడు. ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించే ఇండస్ట్రీ అని పేరు రావడం వల్లే వారిపై ఒక రకమైన ప్రెజర్ ఏర్పడుతుందని, అలా లేకపోతే ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు తాము కూడా తెరకెక్కించగలము అంటూ హాట్ కామెంట్స్ చేశాడు ‘మార్కో’ (Marco) ఫేమ్ ఉన్ని ముకుందన్.


ప్రెజర్ ఉంది

‘‘మలయాళ సినిమాలు మంచిగా ఉంటాయనే మంచి పేరు ఉంది. కానీ అది నాలాంటి నటులకు భారంగా ఉంటుంది. నేను చేసే ప్రతీ సినిమాతో గుడ్ సినిమా అనే ట్యాగ్‌ను సంపాదించుకోలేను. కేవలం ఇలాంటి సినిమాలు మాత్రమే చేయాలి అనే ప్రెజర్ మేకర్స్‌కు ఉండకూడదు. తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో ఇలాంటి ప్రెజర్ ఉండదు. మలయాళ సినిమాలు ఫీల్ గుడ్ అనుకోవడం వల్లే దాని నుండి అంచనాలు కూడా అక్కడ వరకే ఆగిపోయాయి. దాని వల్ల మంచి సినిమాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే మలయాళం నుండి భారీ బడ్జెట్ సినిమాలు రావడం లేదు’’ అంటూ మనసులోని మాటలను ఓపెన్‌గా బయటపెట్టేశాడు ఉన్ని ముకుందన్.


అదే కల

‘‘మలయాళ మేకర్స్ కూడా కేజీఎఫ్, బాహుబలి లాంటి సినిమాలను తెరకెక్కించాలి అన్నదే నా కల. పృథ్విరాజ్ సుకుమారన్ కూడా అదే విషయాన్ని చెప్పాడు. మా దగ్గర మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఇంకా ఏది మమ్మల్ని ఆపుతుంది అనేది తెలియడం లేదు’’ అంటూ మాలీవుడ్ ఉన్న పరిస్థితిని స్పష్టంగా తెలియజేశాడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). తన మాటలకు ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. మాలీవుడ్ మేకర్స్‌లో క్రియేటివిటీ ఉన్నా కూడా ఫీల్ గుడ్ సినిమాలు అనే ట్యాగ్ ఇచ్చేసి వారి క్రియేటివిటీని ఆపేస్తున్నామని ఫీలవుతున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ తెరకెక్కించే సినిమాలపై ప్రశంసలు కురిపించాడు ఉన్ని ముకుందన్.

Also Read: సిద్ధుతో సినిమా చేస్తానంటే అలాంటి కండీషన్ పెట్టాడు.. రివీల్ చేసిన రానా

గ్రాండ్ విజన్

‘‘తెలుగులో సినిమాల్లో విజన్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. వారి ఎగ్జిక్యూషన్ కూడా అలాగే ఉంటుంది. చాలాకాలం పాటు ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాల్లో నటించడం నాకు ఇష్టం. అసలు మలయాళం నుండి మార్కో లాంటి సినిమా ఎలా వచ్చింది అని ప్రేక్షకులు నన్ను అడిగినప్పుడు అసలు ఇలాంటి సినిమా ఎందుకు రాకూడదు అని నేను వారిని తిరిగి ప్రశ్నిస్తాను’’ అని తెలిపాడు ఉన్ని ముకుందన్. ఎప్పుడూ ఫీల్ గుడ్ సినిమాలకే పరిమితమయిన మలయాళ మేకర్స్ నుండి ‘మార్కో’ లాంటి వైలెంట్ మూవీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అలాంటి మూవీతో ఉన్ని ముకుందన్ ఒక బెంచ్‌‌మార్క్ క్రియేట్ చేశాడనే చెప్పాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×