Srindhi Shetty : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా ఈ సినిమాతో ప్రభంజనం సృష్టించాడు ప్రశాంత్. చూడటానికి చాలా క్లాస్ గా కనిపించినా కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ను మాత్రమే నమ్ముకోకుండా దానిని మించిన మదర్ ఎమోషన్ను ఆ సినిమాలో చూపించాడు ప్రశాంత్. అందుకే ఆ సినిమా ఎక్కువ శాతం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాతో కేవలం కన్నడలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది.
ఒక ప్రస్తుతం శ్రీనిధికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
వరుస అవకాశాలు
కే జి ఎఫ్ సినిమాతో గుర్తింపు సాధించుకున్న శ్రీనిధికి తమిళ్లో విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో కూడా చేసే అవకాశం వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం తెలుగులో నాని సరసన హిట్ 3 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. శైలేష్ కొలను ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా తెరకెక్కించాడు. ఇదివరకే 1,2 సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇది వరకే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచుతుంది. మే 1న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది చిత్ర యూనిట్.
Also Read : Salman Khan: సల్మాన్ ఖాన్ ‘బ్లూ బ్రాస్లెట్’ అంత పవర్‌ఫుల్లా? దాని సీక్రెట్ ఏమిటీ.. ధర ఎంత? ఎక్కడ లభిస్తుంది?
నానితో అవకాశం
సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే దర్శకురాలు నీరజా కోనకు, నాని కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకోసమే తెలుసు కదా సినిమా ముహూర్తానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన శ్రీనిధి శెట్టి మరియు రాశి కన్నా నటిస్తున్నారు. అక్కడ శ్రీనిధి శెట్టిని చూశాడు నాని. అప్పుడు తన సినిమాలో బాగుంటుంది అని శైలేష్ కొలనుకు చెప్పడం వలన హిట్ 3 సినిమాలో శ్రీనిధి శెట్టికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
Also Read : Shivani Rajasekhar : నేను రిజెక్ట్ చేసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది