BigTV English

TDP : 53 కత్తిపోట్లు.. చంద్రబాబు కంటతడి.. వీరయ్య చౌదరిని చంపింది ఆ వైసీపీ లీడరేనా?

TDP : 53 కత్తిపోట్లు.. చంద్రబాబు కంటతడి.. వీరయ్య చౌదరిని చంపింది ఆ వైసీపీ లీడరేనా?

TDP : 53 కత్తిపోట్లు. ఛాతీ, గొంతు, పొట్టపై తీవ్ర గాయాలు. కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. ఘటనా స్థలంలో రక్తం మడుగు కట్టింది. టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. అధికార టీడీపీని ఉలిక్కిపడేలా చేసింది. విషయం తెలిసి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒంగోలు జిల్లా అమ్మనబ్రోలుకు తరలివెళ్లారు. వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై మండిపడ్డారు.


వీరయ్య చౌదరి బ్యాక్ గ్రౌండ్

వీరయ్య చౌదరి. ఒంగోలులో ప్రముఖ టీడీపీ నాయకుడు. మద్యం సిండికేట్ వ్యాపారం చేసేవారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే హరిబాబుకు మేనల్లుడు అవుతారు. వీరయ్య చౌదరి హత్య గురించి తెలియగానే.. హరిబాబుకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. వీరయ్య మర్డర్ ఒంగోలులో తీవ్ర సంచలనంగా మారింది.


ఎంత దారుణంగా చంపారంటే..

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఒంగోలులోని తన ఆఫీసుకు వచ్చారు వీరయ్య చౌదరి. అదే సమయంలో నలుగురు దుండగులు ముఖాలకు కర్చీఫ్ కట్టుకుని కార్యాలయంలోకి దూసుకొచ్చారు. కత్తులతో వీరయ్య చౌదరిపై దారుణంగా పొడిచారు. ఆఫీస్ బాయ్ కేకలు వేయగా.. పక్క బిల్డింగ్ నుంచి ఓ యువకుడు ఏమైందో చూద్దామని అక్కడికి వచ్చాడు. అతన్ని కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు ఆ నలుగురు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన వీరయ్యను ఆసుపత్రికి తరలించారు. వీరయ్య శరీరంపై 53 చోట్ల కత్తి పోట్లు ఉన్నాయి. తీవ్ర రక్తస్రావంతో ఆయన చనిపోయారు.

Also Read : జెత్వానీ న్యూడ్ ఫోటోలు.. ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

వైసీపీ నేత హస్తం?

అయితే, టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వెనుక వైసీపీ నేత హస్తం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ నాగులుప్పలపాడు మండల వైసీపీ లీడర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. అతను చేసే రేషన్ బియ్యం దందాకు వీరయ్య చౌదరి చెక్ పెట్టాడని అంటున్నారు. ఆ వైసీపీ నాయకుడు టీడీపీలో చేరుదామని ప్రయత్నిస్తే.. అతను పార్టీలోకి రాకుండా వీరయ్య అడ్డుకున్నారని చెబుతున్నారు. ఆ కోపంతోనే.. వీరయ్య చౌదరిని ఇంత దారుణంగా చంపిచి ఉంటాడనే అనుమానం వ్యక్తం అవుతోంది. వీరయ్యను దారుణంగా హత్య చేసిన ఆ నలుగురు నిందితుల కోసం 12 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. హంతకులు దొరికితే.. సూత్రదారులు ఎవరో బయటకు వస్తుంది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×