BigTV English

Hrithik Roshan : అంతా ఎన్టీఆర్ వల్లే… వార్ 2 మూవీలో ఇదే హైలెట్

Hrithik Roshan : అంతా ఎన్టీఆర్ వల్లే… వార్ 2  మూవీలో ఇదే హైలెట్

Hrithik Roshan : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్నసినిమా వార్ 2. ఎస్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం వార్ కి సీక్వెల్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నిమిషాలలో వైరల్ అవుతుంది. ఇప్పుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు హృతిక్ రోషన్ ఏమన్నాడో చూద్దాం..


ఆయన గ్రేట్ యాక్టర్..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మేజర్ కబీర్ గా మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. మొదటి పార్ట్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో జతకలిసి సీక్వెల్ లో నటిస్తున్నాడు. తాజాగా హృతిక్ రోషన్ ఒక రోడ్ షోలో అభిమానులతో సినిమా గురించి మాట్లాడారు. హృతిక్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను అద్భుతమైన నటులతో కలిసి నటించాను. పార్ట్ వన్ కన్నా పార్ట్ 2 లో అద్భుతమైన యాక్షన్ సీన్స్ ని చూస్తారు. నేను ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. గ్రేట్ యాక్టర్, మా ఇద్దరి మధ్య జరిగె యాక్షన్ సినిమాకే హైలెట్. మీరు ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని హృతిక్ అభిమానులతో తెలిపారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు అభిమానులందరూ చుట్టూ చేరి, ఎన్టీఆర్ అని అరవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను నందమూరి అభిమానులు షేర్ చేస్తూ ఎన్టీఆర్ గొప్ప నటుడు అని, ఆయన గురించి బాలీవుడ్ స్టార్ హృతిక్ మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.


భారీ బడ్జెట్ తో..

సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో సక్సెస్ అందుకున్నారు. తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నారు. దానికంటే ముందు ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమా కథ కబీర్ దలివాల్ చుట్టూ తిరుగుతుంది. ఒక మిషన్ లో భాగంగా ఎన్టీఆర్, హృతిక్ తో తలపడనున్నాడు. ఈ సినిమాలో యాక్షన్, ఫైటింగ్స్, డాన్స్, ఎమోషనల్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని టాక్. ఇక డాన్స్ విషయానికి వస్తే ఇద్దరూ సూపర్ డాన్సర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు డాన్స్ తో అభిమానుల్ని కట్టిపడేస్తారు. అలాంటిది ఈ సినిమాలో ఇద్దరూ కలిసి ఒకే స్టేజిపై డాన్స్ చేయడం అంటే ఇక అద్భుతమని చెప్పొచ్చు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు నాటికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరూ బడా హీరోలు కలిసి ఓకే సినిమా చేస్తుండడం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సెన్సేషన్ కు దారితీస్తుందో చూడాలి.

Pawan Kalyan : ఇదిగో ఫ్యాన్సూ… ఓజీ రెడీ అయిపోయింది… సూపర్ అప్డేట్ ఇచ్చిన థమన్

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×